Pawan Kalyan on Alliances: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఆ గ్యారెంటీ ఇస్తే పొత్తులు ఉండవట!

Pawan Kalyan Crucial Comments: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గరలో పెద్ద ఎత్తున యువశక్తి పేరుతో ఒక సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పొత్తుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 12, 2023, 09:52 PM IST
Pawan Kalyan on Alliances: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. ఆ గ్యారెంటీ ఇస్తే పొత్తులు ఉండవట!

Pawan Kalyan Crucial Comments on Alliances: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గరలో పెద్ద ఎత్తున యువశక్తి పేరుతో ఒక సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు మీద పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన సభలకు ఇసుకవేస్తే రాలనంత జనం వస్తారని కానీ వారు ఓటు మాత్రం వేయడం లేదని పవన్ పేర్కొన్నారు, 2019 ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడే రాజాంలో రాజ్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని గుర్తు చేసుకున్నారు.

అయితే ఇక్కడ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయామని ఆయన అన్నారు. సభలకు వచ్చిన వారంతా అప్పట్లో చప్పట్లు కొట్టారు జేజేలు పలికారు కానీ ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి ఓటు వేయలేదని తన చెయ్యి వదిలేశారని పవన్ పేర్కొన్నారు, అంతేకాక 2019 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసిన సమయంలో కూడా తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించానని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు ఊడేలా తరిమి కొడతా అని హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని పవన్ పేర్కొన్నారు.

ఇక తనకు అధికారం మీద ఎలాంటి మమకారం లేదని పేర్కొన్న పవన్ కళ్యాణ్ మట్టి పాత్రలో అన్నం పెట్టినా తింటానని ఆయన అన్నారు, ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంతో తాను రాజకీయాలకు వచ్చాను తప్ప అధికారం కోసం కాదని పవన్ అన్నారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి కుట్రలు చేస్తున్నారని దీన్ని ప్రతి జనసైనికుడు ఎదిరించాలని ఆయన కోరారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వమని పేర్కొన్న ఆయన జగన్ మూడు ముక్కల ముఖ్యమంత్రి అని చురకలంటించారు.

అలాగే తనను ఇకమీదట ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అని అంటే జనసైనికుడు చెప్పు తీసుకుని కొడతానని, వీర మహిళ చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించారు. తనను ఇలా దుర్భాషలాడే వారిని తాను ఎప్పటికీ మరిచిపోనని జనసైనికులు కూడా మర్చిపోరని అన్నీ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులు గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని అలా పొత్తు పెట్టుకోకుండా ఉంటే గెలిపిస్తానని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు.

అందరూ తన సభలకు వస్తారు జేజేలు కొడతారు తప్ప ఎన్నికలకు వచ్చి ఓట్లు వేయరని అలాంటప్పుడు తనని గెలిపిస్తానని గ్యారెంటీ ఇస్తే మరెవరితోనూ పొత్తు పెట్టుకొను అని ఆయన అన్నారు. జనాన్ని నమ్ముకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని వాళ్లే తన మధ్యలో ముంచేసారని పవన్ పేర్కొన్నారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ రోజా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఆమె డైమండ్ రాణి రోజా అంటూ ఆయన కామెంట్ చేశారు. 

Also Read: Buddha Venkanna Counter : వర్మకు విషయం లేదా.. బుద్దా వెంకన్న అంత మాట అనేశాడు ఏంటి?

Also Read: Veera Simha Reddy :ఊహించని షాక్.. విడుదలైన గంటల వ్యవధిలోనే హెచ్డీ ప్రింట్ లీక్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News