Pawan Kalyan: ఆడ బిడ్డల జోలికి వస్తే బలంగా సమాధానమిస్తాం..ప్రకాశం జిల్లా ఘటనపై పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ మరోసారి ఫైర్ అయ్యారు. ఆడ బిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామన్నారు. మీడియాపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 24, 2022, 08:59 PM IST
  • వైసీపీ తీరుపై పవన్ కళ్యాణ్‌ ఫైర్
  • ప్రకాశం జిల్లా ఘటనపై సిరీయస్
  • కేసు ఉపసంహరించుకోవాలన్న పవన్
Pawan Kalyan: ఆడ బిడ్డల జోలికి వస్తే బలంగా సమాధానమిస్తాం..ప్రకాశం జిల్లా ఘటనపై పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ మరోసారి ఫైర్ అయ్యారు. ఆడ బిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామన్నారు. మీడియాపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు. తమ పార్టీ నేత రాయపాటి అరుణను వైసీపీ కార్యకర్తలు ఫోన్‌ చేసి అసభ్య పద జాలంతో దూషిస్తున్నారని..ఇది మంచి పద్దతి కాదని చెప్పారు. 

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమేనని..స్థాయి దాటి దూషణలకు దిగితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించి కేసులు పెట్టడటం ఏంటన్నారు. రాయపాటి అరుణకు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. 

తన అనుచరులను అదుపులో పెట్టుకోవాలని తెలిపారు. ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. వెంటనే ఛానళ్లపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కౌలు భరోసా యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. 

రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. అన్ని స్థానాలకు పోటీ చేస్తామంటూనే పొత్తులపై సంకేతాలు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మాత్రం జనసేన తమతోనే ఉందని..ఇప్పటికీ పొత్తు కొనసాగుతోందని అంటోంది. ఈపరిస్థితుల్లో పవన్‌ కళ్యాణ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది.

Also read:Nandamuri Balakrishna: కరోనా బారిన పడ్డ నట సింహం..వెల్లడించిన నందమూరి బాలకృష్ణ..!

Also read:Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు..ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News