Naga Ramakrishnas another selfie video : ఇటీవల పాల్వంచ పట్టణంలో ఆత్మహత్య (Palvancha family suicide case) చేసుకున్న నాగ రామకృష్ణకు సంబంధించి మరో సెల్ఫీ వీడియో వెలుగుచూసింది. తన ఆత్మహత్యకు మొదటి సూత్రధారి వనమా రాఘవనే అని వీడియోలో రామకృష్ణ పేర్కొన్నారు. తన తల్లి, సోదరి అతనికి సహకరించి.. తనకు న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తి వాటాను రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, తన సోదరి కొమ్మిశెట్టి మాధవితో రాఘవకు 20 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందన్నారు. ఆ అక్రమ సంబంధం వల్లే ఒక కుటుంబం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. తానేమీ అనవసర అభియోగాలు, ఆరోపణలు చేయట్లేదన్నారు.
'నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి మొదటి పాత్రధారి, సూత్రధారి వనమా రాఘవేంద్ర. మా అక్క కొమ్మిశెట్టి మాధవితో రాఘవకు 20 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉంది. దీనికి మధ్యవర్తిగా మా అమ్మ గారి సహకారం. ఈ ముగ్గురు కలిసి తండ్రి ద్వారా న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఏడాది క్రితం పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఆస్తి పంపకాలకు కాగితాలు రాసుకున్నాం. కానీ ఏడాది నుంచి దాన్ని పెండింగ్‌లో పెట్టి... నన్ను అప్పుల ఊబిలోకి నెట్టారు. నాకు చావు తప్ప వేరే మార్గం లేని పరిస్థితికి తీసుకొచ్చారు. అక్రమ సంబంధం వల్ల ఒక కుటుంబం, వంశం నాశనమయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్లను ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నాను..' అని సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ పేర్కొన్నారు.
'ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే రాఘవకు (Vanama Raghava) మా ఫ్యామిలీ విషయాల్లో ఎందుకంత ఇంట్రస్ట్.. మా అక్క బాధపడుతుందన్న ఆలోచనతో ప్రతీ విషయంలో కలగజేసుకునేవాడు.' అని నాగ రామకృష్ణ వెల్లడించాడు. తమ స్వగ్రామం పోలవరం మండలంలోని పట్టిసీమ అని... హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన తన తండ్రిని 1992లో నక్సలైట్లు చంపేశారని తెలిపారు. తన సోదరికి పోలవరంలో రెండెకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో ఇంటి స్థలం, తల్లి రిటైర్మెంట్ డబ్బులో వాటా ఇచ్చామన్నారు. ప్రస్తుతం తన తల్లి కూడా సోదరితోనే ఉంటోందని... తాను, తన కుటుంబం అద్దె ఇంటిలో ఉంటున్నామని తెలిపారు. ఇప్పటివరకూ రూ.30 లక్షలు అప్పులు అయ్యాయని.. తనకు అప్పులు ఇచ్చిన వారికి అన్యాయం చేయొద్దని అన్నారు.
Also Read: Jaffer - Kohli: కోహ్లీని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన జాఫర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి