AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం..

AP Rain Alert: బుధవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 08:37 AM IST
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం..

Weather Updates: బంగాళాఖాతం(bay of bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావారణశాఖ(IMD) హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం(Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది.

Also Read: బ్రేకింగ్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు.. 30 మంది మహిళల ప్రాణాలు కాపాడిన స్థానికులు

ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్‌ జిల్లాలో భారీవర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.  రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్‌ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు. 

Also Read: ఏపీ వరద భీభత్సం మిగిల్చిన దృశ్యాలు, ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ వ్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News