Nellore Rape Incident: నెల్లూరులో దారుణం.. పట్టపగలు అంతా చూస్తుండగానే మహిళపై రేప్..

Nellore Rape Incident:నెల్లూరులో దారుణం జరిగింది. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. రక్షించాలంటూ ఆ మహిళ చేసిన ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగిలాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 03:20 PM IST
  • నెల్లూరు జిల్లాలో దారుణం
  • పశువులను మేపేందుకు వెళ్లిన మహిళపై అత్యాచారం
Nellore Rape Incident: నెల్లూరులో దారుణం.. పట్టపగలు అంతా చూస్తుండగానే మహిళపై రేప్..

Nellore Rape Incident: నెల్లూరులో దారుణం జరిగింది. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. రక్షించాలంటూ ఆ మహిళ చేసిన ఆక్రందనలు అరణ్య రోదనగానే మిగిలాయి. గత శనివారం (19) చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఎప్పటిలాగే శనివారం పశువులను మేపేందుకు వెళ్లింది. ఇంటికి సమీపంలోని పొలాల్లో పశువులను మేపుతుండగా.. ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటిస్తున్నా వినకుండా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కామాంధుడి బారి నుంచి తనను రక్షించాలని ఆమె గట్టిగా కేకలు పెట్టింది.

ఆ సమయంలో అక్కడే పలువురు పశువులు కాస్తున్నప్పటికీ.. ఆ కామాంధుడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో బాధితురాలి ఆక్రందన అరణ్య రోదనే అయింది. కాసేపటికి నిందితుడి భార్య అటు వైపుగా వచ్చి అతన్ని అడ్డుకోవడంతో బాధితురాలు అతని బారి నుంచి తప్పించుకోగలిగింది. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచార ఘటనపై ఇప్పటివరకూ తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించడం గమనార్హం. అయినప్పటికీ విచారణ జరుపుతామని స్థానిక ఎస్సై తెలిపినట్లు తెలుస్తోంది. 

Also Read: Jagga Reddy on Revanth Reddy: నా పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే.. టైమ్ వచ్చినప్పుడు ఝలక్ ఇస్తా... 

Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News