MP Lavu Sri Krishna Devarayalu: సీఎం జగన్‌కు సిట్టింగ్ ఎంపీ బిగ్ షాక్.. పదవికి, పార్టీకి గుడ్‌ బై

AP Assembly Election 2024: సీఎం జగన్‌కు సిట్టింగ్ ఎంపీ బిగ్‌ షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిలకు ముందు వరుస రాజీనామాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 23, 2024, 02:55 PM IST
MP Lavu Sri Krishna Devarayalu: సీఎం జగన్‌కు సిట్టింగ్ ఎంపీ బిగ్ షాక్.. పదవికి, పార్టీకి గుడ్‌ బై

AP Assembly Election 2024: ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయం మరింత హీటెక్కుతోంది. అభ్యర్థుల మార్పు అధికార వైసీపీలో చిచ్చు రేపుతోంది. టికెట్ దక్కని నేతలు వరుసగా రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో బీసీకి సీటు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించుకోవడంతో గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే పార్టీలో అనిశ్చితికి తాను కారణం కాదని స్పష్టం చేశారు. 

Trending News