హైదరాబాద్: టీడీపీ నేత సీఎం రమేష్ నివాసంలో ఐటీ దాడులు నిర్వహస్తున్న నేపథ్యంలో దీనిపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ మోదీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చెయ్యాలనే కుట్రలో భాగంగా పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కడప ఉక్కుకర్మాగారం కోసం పోరాడినందుకే ఎంపీ సీఎం రమేష్ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. హోదా సాధన కోసం పోరాటం ఆపేదిలేదన్నారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్ స్పష్టం చేశారు.
మోడీ ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రుల పై దాడి. హోదా తో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలి అని నిలదీసినందుకు మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు.మొన్న బీద మస్తాన్ రావు,నిన్న సుజనా చౌదరి,ఈ రోజు సిఎం రమేష్.
కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు అని అన్నందుకు ఎంపీ సిఎం రమేష్ పై ఐటీ దాడులు.— Lokesh Nara (@naralokesh) October 12, 2018
The Centre has begun intimidation politics with IT raids on party leaders Mastan Rao garu, Sujana garu and now CM Ramesh garu . TDP leaders are being unduly targeted for raising voice against the Centre for breaking every promise made during bifurcation.
— Lokesh Nara (@naralokesh) October 12, 2018