AP: ఐపీసీ, సీఆర్‌పీసీల్లో సవరణ తీసుకురండి, ప్రధానిని కోరిన విజయసాయి రెడ్డి

Ap: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు ప్రధాని ముందుకు తీసుకొచ్చారు ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం, ప్రత్యేక హోదా వంటి అంశాలపై గళమెత్తారు.

Last Updated : Jan 30, 2021, 04:22 PM IST
AP: ఐపీసీ, సీఆర్‌పీసీల్లో సవరణ తీసుకురండి, ప్రధానిని కోరిన విజయసాయి రెడ్డి

Ap: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు ప్రధాని ముందుకు తీసుకొచ్చారు ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం, ప్రత్యేక హోదా వంటి అంశాలపై గళమెత్తారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ( All Party ) జరిగింది. ఈ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Mp Vijaya sai reddy ) రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల్ని ప్రస్తావించారు. తక్షణం పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్రానికి ప్రత్యేక హోదా ( Special status ) ఇవ్వాలని..కర్నూలులో హైకోర్టు ( HIgh Court ) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని సమావేశంలో కోరారు. విశాఖపట్నం ( Visakhapatnam ) లో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకు విజ్ఞప్తి చేశారు. భౌగోళిక ప్రాతిపదికన జల వనరులు కేటాయించాలన్నారు. దిశ చట్టానికి తక్షణం అనుమతులివ్వాలని కోరారు. అత్యాచారాలకు పాల్పడినవారికి వెంటనే శిక్షలు పడేలా ఐపీసీ ( IPC ) , సీఆర్‌పీసీ ( CRPC ) ల్లో సవరణలు తీసుకురావాలని ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు. 

మరోవైపు రైతు సమస్యల్ని ఇదే సమావేశంలో ప్రస్తావించారు. గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రత్యేక రైతు కమిషీన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ ( TDP ) నేతలున్నట్లు సీసీ ఫుటేజ్‌‌ ఆధారాలు బయటపడ్డాయని, ఐపీసీ 295కు సవరణ తీసుకొచ్చి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Also read: Privilege notices: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News