కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రత ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉంది. అయితే సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey In AP)లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 90 శాతానికి పైగా కరోనా కేసులలో బాధితులకు కోవిడ్19 లక్షణాలు లేకపోవడం గమనార్హం. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి లాంటి లక్షణాలు లేకున్నా కోవిడ్19 టెస్టులలో పాజిటివ్‌గా వస్తున్నట్లు తూర్పు గోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey)లో తేలింది. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
అత్యధికంగా అనంతపురం జిల్లాలో 99.5 శాతం కరోనా పేషెంట్లలో, కృష్ణాలో 99.4శాతం, నెల్లూరులో 96.1 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 92.8 శాతం మందికి కరోనా లక్షణాలు లేకున్నా కోవిడ్19 టెస్టులలో పాజిటివ్‌గా తేలింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో 22 శాతం మందికి కరోనా వచ్చినా.. కోవిడ్10 యాంటీబాడీస్ వృద్ధి చెందడంతో వారికి తెలియకుండానే వైరస్ బారి నుంచి బయటపడ్డారని సీరో సర్వైలెన్స్ సర్వేలో గుర్తించారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్
JEE మెయిన్స్, NEET హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా తేలిన వారిని 10 రోజులపాలు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఈ వ్యవధిలో జ్వరం, తలనొప్పి, జలుబు, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులు పరిశీలించిన అనంతరం మందులు ఇస్తారు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా లక్షణాలు లేని బాధితులు త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. Photo Story: ప్రత్యర్ధి దిమ్మతిరిగిన పంచ్.. సినిమా చూపించిన రష్యా బాక్సర్
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది
నాలుగు జిల్లాల్లో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే
బాధితులలో 90 శాతం మందికి కోవిడ్19 లక్షణాలు లేవు
కరోనా సోకినట్లు తెలియకముందే కొందరికి విముక్తి