LPG subsidy: కేంద్ర సర్కార్ భారీ షాక్.. వంట గ్యాస్‌‌పై సబ్సిడీ ఎత్తివేత.. మరిన్ని షాకులు తప్పవా!

LPG subsidy: ఒక చేత్తో ఇచ్చి మరీ చేతితో తీసుకోవడం అంటే ఇదేనేమో... ఇటీవలే ఎల్పీజీ వంట గ్యాస్ ధరను 2 వందల రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో వినియోగదారులు ఊరట చెందారు. కాని రెండు వారాల్లోనే వాళ్ల సంతోషం ఆవిరైంది. మోడీ సర్కార్ అసలు ప్లాన్ తెలిసి షాకవుతున్నారు

Written by - Srisailam | Last Updated : Jun 3, 2022, 07:54 AM IST
  • ఎల్పీజీ కస్టమర్లకు కేంద్రం షాక్
  • వంట గ్యాస్‌‌పై సబ్సిడీ ఎత్తివేత
  • కేంద్రంపై వినియోగదారుల ఫైర్
LPG subsidy: కేంద్ర సర్కార్ భారీ షాక్.. వంట గ్యాస్‌‌పై సబ్సిడీ ఎత్తివేత.. మరిన్ని షాకులు తప్పవా!

LPG subsidy: ఒక చేత్తో ఇచ్చి మరీ చేతితో తీసుకోవడం అంటే ఇదేనేమో... ఇటీవలే ఎల్పీజీ వంట గ్యాస్ ధరను 2 వందల రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో వినియోగదారులు ఊరట చెందారు. కాని రెండు వారాల్లోనే వాళ్ల సంతోషం ఆవిరైంది. మోడీ సర్కార్ అసలు ప్లాన్ తెలిసి షాకవుతున్నారు ఎల్పీజీ కస్టమర్లు. సామాన్యులకు షాకిచ్చింది కేంద్రం. గ్యాస్‌కి సబ్సిడీని ఎత్తివేసింది. సబ్సిడీని కేవలం ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేసింది.

దేశంలో దాదాపుగా 30 కోట్ల వరకు ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో  ఉజ్వల యోజన స్కీమ్ కస్టమర్లు దాదాపు 9 కోట్లు. కేంద్ర సర్కార్ తాజా నిర్ణయంతో మిగిలిన 21 మంది ఎల్పీజీ కస్టమర్లకు సబ్సిడీ లేనట్టే. ఉజ్వల యోజన లబ్దిదారులు కానివాళ్లంతా మార్కెట్ ధరకే ఎల్పీజీని కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే 9 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్దిదారులకు 200 వంద రూపాయల సబ్సిడీని ప్రకటించిన కేంద్రం.. మిగిలిన 21 కోట్ల మంది వినియోగదారులకు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీకి మంగళం పాడింది. 30 శాతం మందికి సబ్సిడీ పెంచి, 70 శాతం మందికి ఎత్తివేయడం అంటే ఒక చేత్తో ఇచ్చి మరీ చేతితో లాక్కోవడమే అన్న విమర్శలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలో సిలిండర్ ధర 11 వందల రూపాయలకు పైగానే ఉండనుంది. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ ధర 1054 రూపాయలుగా ఉంది. సబ్సిడీగా 40 రూపాయలు వస్తున్నాయి. ఇక నుంచి ఈ సబ్సిడీ రాదు. అంటే ఇక నుంచి ఉజ్వల యోజన లబ్దిదారులు మినహా మిగితావాళ్లు 11 వందల రూపాయలకు పైగానే చెల్లించాల్సి ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే  ఉజ్వల యోజన లబ్దిదారులకు కూడా సబ్సిడీ ఎక్కువ కాలం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2022-23 బడ్జెట్ లో కేంద్రం పెట్టిన నిధులు కూడా ఇదే వాదనకు బలం చేకూరుస్తోంది.  

2014 ఏప్రిల్‌ లో వంట గ్యాస్‌ ధర 410 రూపాయలుగా ఉంది. 2019 మేలో 769కి పెరిగింది. అయితే సబ్సిడీగా 260 రూపాయలు వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. క్రమంగా ఈ రాయితీని తగ్గిస్తూ వస్తోంది బీజేపీ ప్రభుత్వం. 2021 జనవరి 1న వంట గ్యాస్ ధరను 23 రూపాయలు తగ్గించి.. సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో  2021 ఫిబ్రవరి నుంచీ 40 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ వస్తోంది.తాజాగా సబ్సిడీని ఎత్తివేయడంతో 21 కోట్ల మందికి 40 రూపాయల రాయితీ కూడా రాదు. సబ్సిడీని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై వినియోగదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

READ ALSO: CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?

READ ALSO: AP 10th Results: రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News