Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!

Minister Roja Counter Pawan Kalyan and Chandrababu: రజనీకాంత్ తరహాలో డైలాగ్ చెప్పి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. పవన్, చంద్రబాబులకు విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని సీఎం జగన్‌ను కోరారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 28, 2023, 04:04 PM IST
Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!

Minister Roja Counter Pawan Kalyan and Chandrababu: జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన స్కీమ్స్ నిధులను సీఎం జగన్‌ మోహన్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన బహిరంగ సభలో బటన్ నొక్కి విడుదల చేశారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.680.44 కోట్లను నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. నగరిలో జగనన్న పేరు చంద్రబాబు నాయుడు గుండెల్లో రీసౌండ్‌ రావాలని అన్నారు. ఒకప్పుడు పెత్తందార్ల ఆస్తి అయిన విద్యను పేదవాడి హక్కుగా మార్చారని అన్నారు. దేశ భవిష్యత్‌ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి చెప్పిన మాటలను సీఎం జగనన్న అక్షరాలా ఆ మాటను నిజం చేస్తున్నారని చెప్పారు.

"జగనన్నకు ఒక చిన్న రిక్వెస్ట్.. అన్నా ఇన్ని లక్షల మందికి విద్యాదీవెన ఇస్తున్నాం.. కానీ ఇంకో ఇద్దరికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా.. వారు ఎవరో కాదు పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు. పవన్‌ ఒక ఇంటర్వ్యూలో ఇంటర్‌లో తను సీఈసీ అని ఒకసారి.. హెచ్‌ఈసీ అని ఒకసారి ఎంపీసీ అంటారు. చంద్రబాబు ఇంజినీరింగ్‌ చదవాలంటే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్‌ తీసుకోవాలంటారు. వీరిద్దరికీ విద్యాదీవెన వర్తింపజేయాలంటే ఏపీలో వారికి ఇల్లు లేదు ఓటు లేదు. ఆధార్‌ కార్డు కూడా లేదు. 

కాబట్టి సీఎంగా మీకు స్పెషల్‌ పవర్స్‌ ఉంటాయి. అవి ఉపయోగించి వారిద్దరికీ విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వీరంతా కూడా పిచ్చిపిచ్చి మాటలతో ఊగిపోతూ ఒకడు, జారిపోతూ ఒకడు, మరిచిపోతూ ఒకడు రాష్ట్రంలో ప్రజలను విసిగిస్తున్నారు. విద్యార్ధుల్లారా మీకందరికీ ఒకటే చెబుతున్నా, టీడీపీని నమ్ముకుంటే విద్యార్ధులు జైళ్ళకు వెళతారు, పవన్‌ను నమ్ముకుంటే సినిమాలకు వెళతారు కానీ జగనన్నను నమ్ముకుంటే మంచి కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళ్లి జీవితంలో చక్కగా సెటిలవుతారు.

2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు అయినా వార్‌ వన్‌ సైడ్. అలాంటి జగనన్నను కొంతమంది ఓడిస్తామని, కొంతమంది ఆడిస్తామని, కొంతమంది పాలిస్తామంటున్నారు. కానీ అలా ఎవరూ పుట్టలేదు. జగనన్నను ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి. జగనన్నను ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి. చంద్రబాబు, పవన్, లోకేష్‌ ఊరుఊరు తిరుగతూ విమర్శలు చేస్తున్నారు.

నాకు ఈ మధ్యే రిలీజయిన రజనీకాంత్‌ సినిమా డైలాగ్‌ గుర్తుకొస్తుంది. మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరూ లేదు.. ఈ రెండూ లేని ఊరే లేదు. (ఇదే డైలాగ్‌ తమిళ్‌లో కూడా చెప్పారు.) పవన్‌ ఎంత విమర్శించినా.. లోకేష్‌ ఎంత మొరిగినా.. చంద్రబాబు ఊరూరు తిరిగి ఎన్ని అబద్దాలు చెప్పినా 2024 జగనన్న వన్స్‌మోర్‌ అని ప్రజలు పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను ధైర్యంగా రాయలసీమ గడ్డపై నుంచి చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా.. నిన్ను సీఎం చేసిన కుప్పంకు వెళదాం.. అక్కడ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని ఇచ్చింది నువ్వా జగనన్నా అడుగుదాం.. నాన్నకొడుకులు గల్లీగల్లీ తిరిగినా ప్రజలు హైదరాబాద్‌ తరిమితరిమి కొట్టారు.." అని మంత్రి రోజా అన్నారు.  

Also Read: Multiple Bank Accounts: ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయా..? తప్పకుండా తెలుసుకోండి..!   

Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News