Minister Kottu Satyanarayana: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఒక వేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వేదికపై ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు వాదనకు చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, ఎమ్మెల్యే.. వేదికపై అభివృద్ధి పనుల గురించి మాట్లాడే సమయంలో ఒకరికి ఒకరికి పొంతన లేక ఒకరిపై ఒకరు మాట్లాడారు. సత్రాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10 నుంచి 20 లక్షలు డిపాజిట్ ట్రస్ట్ బోర్డు పెట్టగా.. ట్రస్ట్ బోర్డులో తీర్మానించిన అంశాలను మంత్రి కొట్టు సత్యనారాయణ కొట్టివేశారు. సత్రాలకు 50 లక్షలు డిపాజిట్ పెడితేనే బాగుంటుందంటూ మాట్లాడారు.
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందిస్తూ.. రూ.50 లక్షలు సత్రాలకు వారు కట్టలేరని.. దీనిపై మీ నిర్ణయం మార్చుకోవాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణకు సూచించారు. మంత్రి మాట్లాడే సమయంలో ట్రస్టు బోర్డు, మెంబర్ విరూపాక్షయ్య కలుగజేసుకోగా.. ఇదేమి వివాదం కాదని చర్చించుకుందామని మంత్రి సూచించారు. "దేవస్థానం వారు కట్టే కాటేజీకి రూ.10 లక్షలు డొనేషన్ పెట్టినప్పుడు ప్రైవేట్ సత్రాల వారు 5 లక్షలు డొనేషన్ పెట్టుకుంటారు. ఆ మాత్రం కట్టకపోతే దేవస్థానంలో ఎటువంటి కన్స్‌ట్రక్షన్ జరగవు.." అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే శిల్పాతో అన్నారు.
"మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి నీ మాటకు గౌరవం ఇస్తాం. కానీ ఎవరైనా డబ్బులు కట్టాల్సిందే.. దేవస్థానం అభివృద్ధి పనుల్లో సీఎం దృష్టి పెట్టారు. ఇటువంటివి ఏమన్నా మాట్లాడాలి అంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడుకుందాం.." అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో బోర్డు ఎందుకు ఉండేదన్నారు. చిన్న చిన్న పనులు సీఎం వద్దకు వెళ్లి మాట్లాడాలంటే తాను ఒప్పుకోనని అన్నారు. ఈ విషయం గురించి అందరం ఓసారి కూర్చుందామని మంత్రి అన్నారు. తనకు ఉన్న చనువుతోనే ఎమ్మెల్యేతో తాము మాట్లాడానని.. ఆయన అభిప్రాయం, తన అభిప్రాయం వేరుకాదన్నారు. ఇద్దరిది ఒకటే ఆలోచన అని.. ఏది చేసినా.. అందరికీ సరిపోయేలా నిర్ణయం తీసుకుందామన్నారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter