Tenth and Inter Exam Schedule: టెన్త్, ఇంటర్ షెడ్యూల్ ప్రకటన.. పరీక్షల తేదీలు ఇవే..!

Tenth and Inter Exam Date 2024: విద్యార్థులకు ముఖ్యగమనిక. ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చింది. మార్చి 31వ తేదీలోపు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 04:13 PM IST
Tenth and Inter Exam Schedule: టెన్త్, ఇంటర్ షెడ్యూల్ ప్రకటన.. పరీక్షల తేదీలు ఇవే..!

Tenth and Inter Exam Date 2024: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షలను మార్చి 31లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్య నారాయణ ప్రకటించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 3వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

పదో తరగతి షెడ్యూల్ ఇలా..

==> మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
==> మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్
==> మార్చి 20న ఇంగ్లీష్
==> మార్చి 22న మ్యాథ్స్
==> మార్చి 23న ఫిజికల్ సైన్స్, 
==> మార్చి 26న బయాలజీ
==> మార్చి 27న సోషల్ స్టడీస్
==> మార్చి 28న మొదటి లాంగ్వేజ్ పేపర్-2
==> మార్చి 30న లాంగ్వేజ్ పేపర్-2, వొకేషనల్ కోర్సు పరీక్షలు

గమనిక: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.

Trending News