Ambati on oppositions: వారిని కృష్ణా నదిలో కలుపుతాం..విపక్షాలపై అంబటి మండిపాటు..!

Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 3, 2022, 07:03 PM IST
  • ఏపీలో రాజకీయ హీట్
  • వైసీపీ వర్సెస్ టీడీపీ
  • తాజాగా అంబటి మండిపాటు
Ambati on oppositions: వారిని కృష్ణా నదిలో కలుపుతాం..విపక్షాలపై అంబటి మండిపాటు..!

Ambati on oppositions: ఏపీలో రాజకీయ హీట్ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఏమి చేయలేరన్నారు. రాబోయే ప్లీనరీ సమావేశంలో యుద్ధ భేరీ మోగిస్తామని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. చంద్రబాబు, సొంత పుత్రుడు, దత్త పుత్రుడు కలిసి వచ్చినా..వారిని కృష్ణా నదిలో కలపడానికి వైసీపీ క్యాడర్ సిద్ధంగా ఉందన్నారు అంబటి. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎవరైనా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు ప్రారంభమైయ్యాయని..అక్కడ తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్లీనరీ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. 

ఆ తర్వాత డిక్లరేషన్‌ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే లక్షా 50 వేల కోట్ల సంక్షేమ నిధులను ప్రజలకు అందించామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. టీడీపీ చేపడుతున్న మహానాడు, మినీ మహానాడులను ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే మళ్లీ అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు అంబటి.

Also read:BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం.. సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు

Also read:Kishore Das Died: నటుడి ప్రాణం తీసిన క్యాన్సర్, కరోనా..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News