Konijeti Rosaiah Death : రోశయ్య ఒక యోగిలా ప్రజాసేవ చేశారన్న చిరంజీవి, బాలకృష్ణ

Chiranjeevi, Balakrishna mourns over the death of Rosaiah : కొణిజేటి రోశయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సంతాపం తెలియజేశారు. రోశయ్య ఒక మహోన్నత నేత అంటూ మెగాస్టార్ కొనియాడారు. రోశయ్య మృతి పట్ల సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం ప్ర‌క‌టించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 01:27 PM IST
  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. ఏపీ మాజీ సీఎం రోశయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖుల సంతాపం
  • ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న సెలబ్రిటీలు
  • రోశయ్య మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ సంతాపం
 Konijeti Rosaiah Death : రోశయ్య ఒక యోగిలా ప్రజాసేవ చేశారన్న చిరంజీవి, బాలకృష్ణ

Megastar Chiranjeevi Nandamuri Balakrishna expresses condolences On Konijeti Rosaiah Death: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు (Cine celebrities) రోశయ్యకు సంతాపాన్ని (condolences) ప్రకటించారు. అలాగే ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. 

కాగా, రోశయ్య అంత్యక్రియలు రేపు అంటే డిసెంబర్ 5, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో (Mahaprasthanam) ప్రభుత్వ లాంఛనాల మధ్య నిర్వహించనున్నారు. ఇక రోశయ్య భౌతిక కాయాన్ని స్టార్ హాస్పిటల్ నుంచి అమీర్‌పేట్‌ లోని (Ameerpet) ఆయన నివాసానికి తరలించారు. రోశయ్య పార్థీవదేహాన్ని రేపు ఉదయం గాంధీ‌భవన్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) సంతాపం తెలియజేశారు. రోశయ్య ఒక మహోన్నత నేత అంటూ మెగాస్టార్ కొనియాడారు. రాజకీయ విలువలతో ఒక యోగిలా ప్రజలకు ఆయన సేవ చేశారని పేర్కొన్నారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని మెగాస్టార్ పేర్కొన్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు చిరంజీవి. తనని రాజకీయాల్లోకి రావాలని రోశయ్య మనస్ఫూర‍్తిగా ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు చిరు. వివాదరహితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని చిరంజీవి కొనియాడారు.

 

Also Read : Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

ఇక రోశయ్య మృతి పట్ల సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంతాపం ప్ర‌క‌టించారు. రోశయ్య హఠాన్మరణం తనను ఎంతో కలిచి వేసిందన్నారు. సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారు పేరని గుర్తు చేశారు. అత్యధిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రోశయ్య పేరొందారని పేర్కొన్నారు బాలయ్య.రోశయ్య మృతితో గొప్ప అనుభవం ఉన్న నేతను తెలుగు జాతి కోల్పోయినట్లు అయ్యిందని బాధపడ్డారు. కంచు కంఠంతో నిండైన రూపంతో.. పంచె కట్టుతో తెలుగు సంప్రదాయానికి రోశయ్య (Konijeti Rosaiah) ప్రతీకగా ఉండేవారని బాలకృష్ణ పేర్కొన్నారు.

Also Read : AdaviThalliMaata:'సెప్తున్న నీ మంచి సెడ్డ..అంతోటి పంతాలు పోవాకు బిడ్డ' బీమ్లా నాయక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News