Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Alla Ramakrishna Reddy Resigned To Ysrcp And Mla Post: ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. మంగళగిరి టికెట్ ఈసారి గంజి అంజికి ఇచ్చే అవకాశం ఉండడంతోపాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడంపై అసహనంతో ఉన్నారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Dec 11, 2023, 02:15 PM IST
Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

Alla Ramakrishna Reddy Resigned To Ysrcp And Mla Post: అధికార వైఎస్సార్టీపీకి బిగ్‌షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖలో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను పంపించారు. మంగళగిరి వైసీపీ పార్టీ టికెట్‌ను ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మంగళగిరి పార్టీ కార్యక్రమాల్లో గంజి  చిరంజీవి యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఆదివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని గంజి అంజి ప్రారంభించారు. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన కినుక వహించారు. దీంతో పార్టీకి.. ఎమ్మెల్యే పదవి గుడ్‌ బై చెప్పారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారా లోకేష్‌పై విజయం సాధించిన ఎమ్మెల్యే ఆర్కే సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2014లో కూడా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి శాసనసభలో అడగుపెట్టారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మంత్రి పదవి ఆశించినా.. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆర్కేకు అవకాశం దక్కలేదు. 

తెలుగుదేశం పార్టీ నుంచి గంజి అంజి వైసీపీలో చేరికతో మంగళగిరిలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. గ్రూపులుగా నాయకులు వీడిపోవడంతో పెద్ద చీలికలు వచ్చాయి. గంజి అంజి పార్టీలోకి చేరడంతో సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని పద్మశాలీ వర్గానికి ఈసారి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి అంజిని మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా గంజి అంజిని నియమించాలని నిర్ణయించింది. 

దీంతో ఆళ్ల రామకృష్టారెడ్డి మనస్థాపం చెందారు. తనను సంప్రదించకుండా అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్కే రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆర్కేను సంప్రదించేందుకు వైసీపీ నేతలు సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేశ్‌ వంటి బలమైన నేత పార్టీని వీడడం వైసీపీకి పెద్ద దెబ్బ అని చెబుతున్నారు.  

Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?

Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News