AP Assembly Election Result 2024 Live Updates: సర్పంచ్‌ చేతిలో మంత్రి ధర్మాన దారుణ ఓటమి

AP Assembly Election Result 2024 Latest Live Updates: ప్రజా తీర్పు నేడు వెల్లడికానుంది. లోక్‌సభ, ఏపీ ఎన్నికల ఫలితాలు మంగళవారం లెక్కించనున్నారు. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికల రిజల్ట్స్ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 4, 2024, 04:28 PM IST
AP Assembly Election Result 2024 Live Updates: సర్పంచ్‌ చేతిలో మంత్రి ధర్మాన దారుణ ఓటమి
Live Blog

AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కౌంట్‌డౌన్ మొదలైంది. మంగళవారం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలుకానుంది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైసీపీకి చెక్ పెడుతుందా..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా మిక్స్‌డ్ రిజల్ట్ రావడంతో గెలుపు ఎవరిదనే విషయంపై పూర్తి క్లారిటీ రాలేదు. మద్యాహ్నం 12 గంటల సమయానికి ఏపీ ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా.. 3.33 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షలమంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

4 June, 2024

  • 16:28 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఫలితాలు ఇలా..

    ===> ఇచ్చాపురం.. టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ గెలుపు
    ===> పలాస ..టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష గెలుపు
    ===> టెక్కలి..టీడీపీ అభ్యర్థి.. కింజరాపు అచ్చెన్నాయుడు గెలుపు
    ===> నరసన్నపేట.. టీడీపీ బగ్గు రమణమూర్తి గెలుపు
    ===> శ్రీకాకుళం.. టీడీపీ గొండు శంకర్ గెలుపు
    ===> పాతపట్నం.. టీడీపీ మామిడి గోవిందరావు గెలుపు
    ===> ఆమదాలవలస.. టీడీపీ కూన రవికుమార్ గెలుపు
    ===> ఎచ్చెర్ల.. బిజెపి నడుకుడుతి  ఈశ్వరరావు గెలుపు
    ===> రాజాం.. టీడీపీ కోండ్రు మురళీ గెలుపు
    ===> పాలకొండ.. జనసేన నిమ్మక జయకృష్ట గెలుపు

  • 16:22 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: విశాఖ ఎంపీగా టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ విజయం సాధించారు. ఆయన 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 16:17 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపొందారు.
    ==> నెల్లూరు రూరల్‌లో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. 31,971 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

  • 15:50 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘోర పరాజయపాలయ్యారు. మంత్రి ధర్మానపై సర్పంచ్, టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ 50,593 ఓట్లతో గెలుపొందారు.

  • 15:23 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: నర్సీపట్నంలో భారీ  విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు

    ==> రికార్డు స్థాయిలో ఒకే పార్టీ , ఒకే నియోజకవర్గం నుంచి పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

  • 14:28 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: నెల్లూరు రూరల్‌లో 13వ రౌండ్ ముగిసేసరికి 19,401 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు.

  • 14:00 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: ముఖ్యమంత్రి పదవికి సీఎం జగన్ రాజీనామా సమర్పించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించే అవకాశం ఉంది. 

  • 13:33 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: కడప జిల్లా 

    ==> ఓటమిని అంగీకరించి కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగిన కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాష.
    ==> మొదటి నుంచి టీడీపీ ప్రతి రౌండ్‌లో  ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన టీడీపీ అభ్యర్థులు 
    ==> ఏ రౌండ్‌లోనూ ఆధిక్యత కనబరచకపోవడంతో కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..

  • 12:53 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: కుప్పం ఆరో రౌండ్ ముగిసేసరికి 11003 ఓట్ల ఆధిక్యతలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.

  • 12:27 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: నంద్యాల అసెంబ్లీలో 13 రౌండ్లు కౌంటింగ్ పూర్తి

    ==> టీడీపీ అభ్యర్థి ఫరూక్ 12,637 మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

  • 12:23 PM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: ఏపీ ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం టీడీపీ 136 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక వైసీపీ కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే వైసీపీ ప్రతిపక్ష హోదా దక్కడం కూడా కష్టంగా మారింది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు గెలుచుకోవాలి.

  • 12:08 PM

    AP Assembly Election Result 2024 Live Updates: తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రెండు నియోజకవర్గాలు

    ==> స్వల్ప మెజార్టీతో తలపడుతున్న వైసీపీ, టీడీపీలు
    ==> మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజు 96 ఓట్ల అతి స్వల్ప మెజార్టీ
    ==> గుంతకల్లులో కూడా వంద ఓట్ల మెజార్టీలో వైసీపీ

  • 11:57 AM

    AP Assembly Election Result 2024 Live Updates: రాప్తాడు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత 10,590 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.

  • 11:46 AM

    AP Assembly Election Result 2024 Live Updates: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం నమోదు చేసింది. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 61వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 11:27 AM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: 15వ రౌండ్ పూర్తయ్యేసరికి రాజమండ్రి రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50,958 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ఏడోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
     

  • 11:25 AM

    AP Assembly Election Result 2024 Live Updates: టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 129 స్థానాల్లో అధిక్యం

    ==> జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో ఆధిక్యం

    ==> బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాల్లో ఆధిక్యం

    ==> 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 11:25 AM

    AP Assembly Election Result 2024 Live Updates: టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 129 స్థానాల్లో అధిక్యం

    ==> జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో ఆధిక్యం

    ==> బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాల్లో ఆధిక్యం

    ==> 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 11:20 AM

    AP Assembly Election Result 2024 Live Updates: నెల్లూరు ఎంపీ
    ==> టీడీపీ వేమిరెడ్డి 68,171
    ==> వైసీపీ విజయసాయిరెడ్డి 53,532
    ==> 14,639 లీడ్ టీడీపీ 

  • 11:09 AM

    AP Assembly Election Result 2024 Live Updates: కడప జిల్లా..

    ==> మైదుకూరులో  7వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ 11,765 ఓట్ల ఆధిక్యం

    ==> కడపలో 3,992 ఓట్లతో టీడీపీ ఆధిక్యం

    ==> కమలాపురంలో 5 రౌండ్లు పూర్తయ్యే సరికి 6,673 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ 

    ==> జమ్మలమడుగులో 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 1,908 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ 

    ==> ప్రొద్దుటూరులో 8 రౌండ్లు ముగిసేసరికి 10,200 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ

  • 11:04 AM

    AP Assembly Election Result 2024 Live Updates: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఒక చోట బీజేపీ, మరో చోట జనసేన, ఇంకొక సీటులో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నాయి. 

    ==> ఓటమి దిశగా స్పీకర్ తమ్మినేని సీతారాం 
    ==> గెలుపు దిశగా ఆమదాలవలస  టీడీపీ అభ్యర్థి కూన రవి కుమార్ 
    ==> కూన రవి కుమార్‌కు 12 వేల ఓట్ల ఆధిక్యత

  • 10:59 AM

    AP Assembly Election Result 2024 Live Updates: నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి 9,132 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నారు.

  • 10:51 AM

    AP Assembly Election Result 2024 Live Updates: పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి 25,244 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 10:43 AM

    AP Assembly Election Result 2024 Live Updates: రాప్తాడులో నాలుగో రౌండ్‌కు  వైసీపీ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డిపై 3420 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఉన్నారు.

  • 10:22 AM

    AP Assembly Election Result 2024 Live Updates: కడప జిల్లాలో ఫలితాలు ఇలా..

    బద్వేల్ : రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సుధమ్మ 2977 ఓట్ల మెజారిటీతో ఉన్నారు

    పులివెందుల : మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 8166 ఓట్ల మెజారిటీతో ఉన్నారు

    కడప : ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కడప టీడీపీ అభ్యర్థి మాధవి రెడ్డి 3699 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

    మైదుకూరు : మూడు రౌండ్లు పూర్తయ్య సమయానికి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 2496 ఓట్లు మెజారిటీతో ఉన్నారు

    కమలాపురం : రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి టీడీపీ అభ్యర్థి పుట్ట చైతన్య రెడ్డి 2042 ఓట్ల ఆధిక్యతో ఉన్నారు.

    జమ్మలమడుగు: రెండు రౌండ్లు పూర్తయ్య సమయానికి వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి 1009 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

    ప్రొద్దుటూరు: నాలుగు రౌండ్లు పూర్తయ్య సమయానికి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 2001 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 10:06 AM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: పిఠాపురం అసెంబ్లీలో నాలుగు రౌండ్లు మూగిసేసరికి పవన్ కళ్యాణ్‌ 20 వేలకు  ఆధిక్యంలో ఉన్నారు. ఆయన భారీ మెజార్టీతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

  • 10:05 AM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: పులివెందులలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. తిరువూరు, ఉదయగిరిలో వైసీపీ ఆధిక్యం కనబరుస్తోంది.

  • 09:57 AM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మూడో  రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 1540 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 09:54 AM

    AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసి సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. పలువురు మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు.

  • 09:39 AM

    Election Result Live Updates: ఏపీలో కూటమి అభ్యర్థులు 105 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. లోక్‌సభ స్థానాల్లో కూటమి 19 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు కేవలం రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 09:33 AM

    Election Result Live Updates: అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్  10 వేల ఓట్లతో లీడ్‌లో ఉన్నారు.

    ==> అనకాపల్లిలో 1800 ఓట్లతో కొణతాల రామకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు

    ==> మాడుగులలో బండారు సత్యనారాయణమూర్తి 2300 ఓట్లతో మెజార్టీలో ఉన్నారు

    ==> నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు 1642 ఓట్లతో లీడ్ ఉన్నారు

    ==> పాయకరావుపేటలో వంగలపూడి అనిత 916 ఓట్లతో మెజార్టీలో ఉన్నారు

    ==> ఎలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ 1800 ఓట్లతో మెజార్టీలో ఉన్నారు

    ==> చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు 1600 ఓట్లు మెజార్టీలో ఉన్నారు

  • 09:27 AM

    Election Result Live Updates: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గలో రెండు రౌండ్లు పోస్టల్ బ్యాలెట్ పూర్తి.. వరప్రసాద్‌పై వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1490 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
     

  • 09:21 AM

    Election Result Live Updates: జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 224 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో రఘురామకృష్ణం రాజు 6349 ముందంజలో ఉన్నారు.

  • 08:57 AM

    Election Result Live Updates: కడప పార్లమెంట్‌లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జగ్గంపేట  తొలి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు 3550 ఓట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు.

  • 08:53 AM

    AP Assembly Election 2024 Result Live Updates: పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నగరిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. 
     

  • 08:40 AM

    AP Assembly Election 2024 Result Live Updates: రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలో మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి 617 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 08:26 AM

    AP Assembly Election 2024 Result Live Updates: అందరూ ఊహించినట్లే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ దూకుడు కనబరుస్తోంది. టీడీపీ అభ్యర్థులు నారాయణ, బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు.

  • 08:21 AM

    AP Assembly Election 2024 Result Live Updates: నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలకు గాను పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి  25,846 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 24, 208 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి.

  • 08:09 AM

    AP Assembly Election 2024 Result Live Updates: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలను లెక్కించనున్నారు.

  • 07:44 AM

    AP Assembly Election 2024 Result Live Updates: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 

    అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో ఎన్నికల కౌంటింగ్ టేబ్లుళ్లు, రౌండ్ల వివరాలు

    ==> అమలాపురం పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 27 రౌండ్లలో ఓట్లు లెక్కింపు

    ==> రామచంద్రపురం: 1,73,917 ఓట్లు..10 టేబుళ్లు, 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

    ==> ముమ్మిడివరం: 2,05,163 ఓట్లు..14 టేబుళ్లు 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

    ==> అమలాపురం: 1,75,845 ఓట్ల..12 టేబుళ్లు, 24 రౌండ్ల ఓట్ల లెక్కింపు

    ==> రాజోలు: 1,56,400 ఓట్లు.. 14 టేబుళ్లు. 21 రౌండ్లు  ఓట్ల లెక్కింపు

    ==> పి.గన్నవరం: 1,65,749 ఓట్లు..12 టేబుళ్లు 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు

    ==> కొత్తపేట: 2,14,975 ఓట్లు..10 టేబుళ్లు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

    ==> మండపేట: 1,91,959 ఓట్లు..10 టేబుళ్లు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

  • 07:40 AM

    AP Assembly Election 2024 Result Live Updates: కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మూడంచల భద్రతా వ్యవస్థ తనిఖీలు చేసిన తర్వాతనే అభ్యర్థులను ఏజెంట్లను అనుమతిస్తున్నారు.

  • 07:32 AM

    AP Assembly Election 2024 Result Live Updates: పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు అత్యధికంగా 2.30 గంటల సమయం పడుతుంది. EVM ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.

  • 06:55 AM

    AP Assembly Election 2024 Result Live Updates: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..

    ==> రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ సీట్ల కౌంటింగ్‌కు రెడీ
    ==> 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు 
    ==> చిత్తూరు ఆర్వీయస్ కాలేజ్-తిరుపతి పద్మావతి యునివర్సీటీలో ఓట్ల లెక్కింపు

  • 06:49 AM

    AP Assembly Election 2024 Result Live Updates: కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల ఫలితాలు మొదట వెలువడనున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే రిజల్ట్స్ రానున్నాయి.

Trending News