AP ASSEMBLY LIVE UPDATES: కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే వెన్నుపోటుతో రిటర్న్ గిఫ్ట్.. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ త్వరగా చనిపోయారన్న జగన్

NTR VS YSR Name WAR: విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు

Last Updated : Sep 21, 2022, 12:43 PM IST
AP ASSEMBLY LIVE UPDATES: కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే వెన్నుపోటుతో రిటర్న్ గిఫ్ట్.. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ త్వరగా చనిపోయారన్న జగన్
Live Blog

NTR VS YSR Name WAR: విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా మారుస్తారంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు... ఎన్టీఆర్‌ పేరు మార్చొద్దని డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది, సభ్యులు ఎంతకు వినకపోవడంతో సభను వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్..

21 September, 2022

  • 12:36 PM

    ఎన్టీఆర్ ను ప్రేమించని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరన్నారు ఏపీ సీఎం జగన్.ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవిస్తానని చెప్పారు సీం జగన్. ఎన్టీఆర్ అనే పదమే చంద్రబాబుకు ఇశ్చం లేదన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే మరికొంత కాలం ఎన్టీఆర్ బతికి ఉండేవారన్నారు. ఎన్టీఆర్ ను వాడు.. వీడు అంటూ చంద్రబాబు నీచంగా మాట్లాడారని జగన్ అన్నారు.చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేశామన్నారు.  కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని జగన్ ఆరోపించారు.

  • 12:13 PM

    ఎన్టీఆర్ వర్శిటీకి పేరు మార్పు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి విడదల రజని

    వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చాలని గతంలో చంద్రబాబే అన్నారు- రజని

    ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడారో జనాలకు తెలుసు- రజనీ

    ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టారు సీఎం జగన్- రజనీ 

  • 11:33 AM

    అధికారిక భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా

    ఎన్టీఆర్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై మనస్తాపం

    హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం బాధాకరం- యార్లగడ్డ

     

  • 11:29 AM

    సస్పెండ్ చేసినా సభలో టీడీపీ ఎమ్మెల్యేలు

    తనపై కాగితాలు విసిరేయడంపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

    టీడీపీ సభ్యులను బలవంతంగా బయటికి తీసుకెళ్లిన మార్షల్స్

  • 10:57 AM

    అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే ఆందోళనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ గీకరించలేదన్నారు. చంద్రబాబు విశ్వసఘాతకుడని.. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. 22 మంది వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ను ఏమీ పీకలేరంటూ నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • 10:32 AM

    చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత లేదు- జోగి రమేష్

    ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టాం- జోగి రమేష్

    చంద్రబాబుపై ఎన్టీఆర్ పై చెప్పులు విసిరారు- రమేష్

    వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ప్రేమ నాటకాలా- రమేష్

  • 10:18 AM

    హెల్త్ వర్శిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య- కేశవ్

    వైఎస్ సహా ఏ సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు- కేశవ్

    ఏపీలో వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి- కేశవ్

    ఆంధ్రప్రదేశ్ ను జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారేమో..

  • 10:10 AM

    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌ పేరు పెట్టడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీతో వైఎస్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయంలో నిర్మించిన యూనివర్శిటీకి తండ్రి పేరు ఎల్లా పెట్టుకుంటావ్ అంటూ జగన్ ను నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చచడం కాదు..కొత్తగా నిర్మించి పేరు పెట్టుకోవాలని సూచించారు.

     

Trending News