Leopard sighted again on tirumala alipiri route: తిరుమలలో మరోసారి చిరుతపులులు హల్ చల్ చేశారు. మెట్ల మార్గంలోని అలిపిరి నడక మార్గం వద్ద రెండు చిరుతలను భక్తులు గమనించారు. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో అవి అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ భద్రత సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత పులులు కన్పించిన ప్రాంతంలో సీసీటీడీ పరిశీలిస్తున్నారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే గతకొన్నిరోజులుగా తిరుమల భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. తిరుమలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఎండకాలం, వరుస సెలవులు నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకొవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
ఇదే క్రమంలో.. భక్తులు భారీగా క్యూలైన్లలో కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటున్నారు. ఇక మరోవైపు.. తిరుమలలో సదుపాయాలు సరిపోక.. రోడ్లమీద కూడా భక్తులు సేదతీరుతున్నారు. ఎలాగైన స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్లాని వెయిట్ చేస్తున్నారు. ఇక గతంలో మెట్ల మార్గంలో అనేక పర్యాయాలు చిరుత పులుల దాడుల ఘటన వార్తలలో నిలిచింది. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు చిరుతల కదలికలను అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పటు చేసి, ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు. ఇప్పటికే అనేక చిరుతలను ఫారెస్టు సిబ్బంది బంధించారు.
రాత్రిపూట కూడా మెట్ల మార్గంలో అధికారులు సీసీ ఫుటేజ్ తో గమనిస్తున్నారు. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు తప్పనిసరిగా తమ చేతుల్లో కర్రను పట్టుకొని వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. గుంపులుగా వెళ్లడం మంచిదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొందరు భక్తులు తిరుపతి స్వామి వారి దర్శనం కోసం అలిపిరిమార్గం గుండా వెళ్తున్నారు.
Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..
అయితే.. రెండు చిరుతలు మెట్ల వద్ద ఉండటాన్ని కొందరు భక్తులు గమనించారు.. వెంటనే బిగ్గరగా కేకలు వేయడంతో అవి భయంతో అడవిలోకి పారిపోయాయి. సంఘటనా స్థలానికి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేరుకున్నారు. చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది కూడా రంగంలో దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Leopard Scare: తిరుమల నడకమార్గంలో హైటెన్షన్.. మెట్ల వద్ద రెండు చిరుత పులుల సంచారం..
అలిపిరి వద్ద చిరుతల హల్ చల్..
గుంపులుగా వెళ్లాలని సూచించిన అధికారులు..