పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. పవన్ కల్యాణ్‌పై మళ్లీ విమర్శలు

తన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇస్తూ పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేసిన కత్తి మహేష్

Last Updated : Sep 30, 2018, 07:22 PM IST
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ.. పవన్ కల్యాణ్‌పై మళ్లీ విమర్శలు

రానున్న ఎన్నికల్లో కత్తి మహేష్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడని, పవన్ కల్యాణ్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయిన ఆయనకు తమ పార్టీ తరపున టికెట్ కేటాయించేందుకు పవన్ అంటే ఇష్టం లేని పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ రంగ ప్రవేశంతోపాటు పలు ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరనని, కాకపోతే దళిత హక్కులను కాపాడే పార్టీకి మద్దతు తెలియజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు దళితజాతికి అన్యాయం చేస్తున్నాయని, ఇటీవల జరిగినవి పరువు హత్యలు కావని, అవి కులహంకారంతో జరిగిన ఉన్మాద హత్యలని అభిప్రాయపడ్డారు. నూతన దళిత నాయకత్వం కోసం జిల్లాల్లో పర్యటిస్తున్నానని చెబుతూ.. రాజకీయాల్లో పరిణతి చెందిన నేతలు ఉంటే బాగుంటుందని అన్నారు. ఇదే విషయంపై మరింత మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 

ఇదిలావుంటే, ఇదే కార్యక్రమంలో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ ప్రతీ విషయంలో వెనుకడుగు వేయడం ఇవాళ కొత్తేం కాదని, ఆయనకు అది మొదటి నుంచి ఉన్న అలవాటేనని విమర్శలు గుప్పించారు.

Trending News