Pawan Kalyan sensational comments on alliance: తాను సీఎం రేసులో లేను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2019లో 40 స్థానాలు గెలిచి ఉంటే.. సీఎం పదవిని తాను డిమాండ్ చేసే వాడినన్నారు. పొత్తులతోనే చాలా పార్టీలు బలపడ్డాయని, వచ్చే ఎన్నికల్లోకలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. ఏపీలో వైసీపీ రాచకాలను ఎదుర్కొనేందుకు బలం ఉన్న ప్రధాన పార్టీలు కలిసి నడవాలని తాము భావిస్తున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పై విధంగా పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... 'బీఆర్ఎస్ కూడా ఒకప్పుడు పొత్తులతోనే బలపడింది. ఇప్పుడు బలంగా ఉన్న బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుంది. పొత్తులతో చాలా పార్టీలు బలపడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అస్సలు చీలకూడదు అన్నది వైకాపాను ఉద్దేశించే. 2014లో పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తులపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుల గురించి మాట్లాడుతున్నా. వైసీపీ వ్యతిరేక ఓటును పోనివ్వం. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం' అని స్పష్టం చేశారు.
'కర్ణాటకలో కుమారస్వామి 30 సీట్లతో సీఎం అయ్యారు. నేను సీఎం అభ్యర్థిని అయితేనే పొత్తు పెట్టుకోవాలని చాలా మంది చెబుతున్నారు. 2019లో 137 స్థానాల్లో పోటీ చేశాం. కనీసం 30-40 స్థానాలు గెలిచి ఉంటే నేను కూడా డిమాండ్ చేసే వాడిని. సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో లేదా బీజేపీనో అడగను. నా సత్తా ఏంటో చూపించి అడుగుతాను. గతంతో పోలిస్తే జనసేన బలం ఇప్పుడు బాగా పెరిగింది. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది' అని పవన్ అన్నారు.
'నేను సంపూర్ణమైన రైతును కాను. కానీ కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని. అన్నీ తెలుసు అంటున్న వైసీపీ నేతలు రైతులకు ఏం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభిస్తాం. బలంగా ఉన్న పార్టీలన్నీ కలిసి వస్తే సంతోషమే. వైసీపీ దాష్టీకాన్ని బలంగా ఎదుర్కొంటాం' అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Also Read: Samantha-MS Dhoni: అయ్యా బాబోయ్.. ఎంఎస్ ధోనీ అంత కూల్‌గా ఎలా ఉంటాడో: సమంత
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.