Pawan Kalyan: నేని చనిపోతే..నా మట్టిని దేశం నలుమూలలా చల్లండి

Pawan Kalyan: రాజమండ్రి సభలో జనసేన అధినేత ఉద్వేగంతో మాట్లాడారు. సుదీర్ఘ యుద్ధంలో తన ప్రాణాలు పోతే దేశం నలుమూలలా మట్టి చల్లాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 2, 2021, 04:13 PM IST
  • రాజమండ్రి జనసేన సభలో ఉద్వేగంగా సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం
  • నేను చనిపోతే నా మట్టిని దేశం నలు మూలలా చల్లండి
  • కాపు, ఒంటరి, బలిజ తెగలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: నేని చనిపోతే..నా మట్టిని దేశం నలుమూలలా చల్లండి

Pawan Kalyan: రాజమండ్రి సభలో జనసేన అధినేత ఉద్వేగంతో మాట్లాడారు. సుదీర్ఘ యుద్ధంలో తన ప్రాణాలు పోతే దేశం నలుమూలలా మట్టి చల్లాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తుదిశ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.

రాజమండ్రిలో జనసేన(Janasena)అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. రోడ్ల దుస్థితిపై వినూత్న ప్రదర్శన చేస్తూ శ్రమదానానికి పిలుపునిచ్చింది జనసేన పార్టీ. ధవళేశ్వరం బ్యారేజ్‌పై శ్రమదానం లేదా ర్యాలీకు అనుమతి లేకపోవడంతో బాలాజిపేట జంక్షన్‌కు కార్యక్రమాన్ని మార్చారు. బాలాజీ పేట జంక్షన్‌లో ఉద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ యుద్ధానికి పిలుపునిచ్చారు.

పోతే ప్రాణం పోవాలి గానీ రాజకీయాల్నించి పోయేది లేదన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని జోస్యం చెప్పారు. కోపాన్ని దాచుకునే కళను అందరూ నేర్చుకోవాలన్నారు. రాయలసీమలో కోపాన్ని మూడు తరాలపాటు దాచుకుంటారన్నారు. అన్యాయం చేసేవాడి వెన్నులోంచి వణుకు పుట్టాలన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని  పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కమ్మవారికి జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకే తెలుగుదేశం పార్టీకు మద్దతిచ్చామని అసలు సంగతి కాస్తా చెప్పేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. తానేమీ ప్రభుత్వం జోలికెళ్లలేదని చెప్పారు. వైసీపీను(Ysr Congress Party) ఎదుర్కొనేందుకు తెలుగుదేశం(Telugu Desam) శక్తి చాలట్లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ సుదీర్ఘ యుద్ధంలో తన ప్రాణాలు పోతే..తన మట్టిని దేశం నలుమూలలా చల్లాలన్నారు. ప్రశ్నించేవాడంటే అధికారపార్టీకు భయం పట్టుకుందన్నారు. తానంటే వైసీపీ భయపడుతోందని చెప్పారు. ఓ కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పనులు జరగడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని మనసులో కోరుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

Also read: Pawan Kalyan Tour: రాజమండ్రిలో ముగిసిన పవన్ కళ్యాణ్ పర్యటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News