Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ యూ టర్న్! టీడీపీలో పరేషాన్.. అంతా ఆయనవల్లేనా?

Pawan Kalyan: ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్... మరోసారి పొత్తులపై కీలక ప్రకటన చేశారు. అయితే  ఈసారి గతంలో చేసిన ప్రకటనకు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే అభిప్రాయం వస్తోంది. జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్న టీడీపీలో కలవరం రేపుతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 20, 2022, 08:06 AM IST
  • పొత్తులపై పవన్ కల్యాణ్ యూటర్న్
  • ప్రజలతోనే జనసేన పొత్తు- పవన్
  • పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో పరేషాన్
Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ యూ టర్న్! టీడీపీలో పరేషాన్.. అంతా ఆయనవల్లేనా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టే కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలే కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే జనసేన లక్ష్యమన్న పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని అన్నారు. వైసీపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధమనే సంకేతం ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ టీడీపీ నేతలు మాట్లాడటం.. త్యాగాలకు సిద్ధమంటూ చంద్రబాబు కామెంట్ చేయడంతో.. ఏపీలో పొత్తులు ఖాయమనే ప్రచారం సాగింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ- జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. పవన్ కామెంట్లతో 20114 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయా లేక టీడీపీ, జనసేన కలుస్తాయా అన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. టీడీపీతో పొత్తుపై బీజేపీ ఆసక్తి లేదనే ప్రచారం సాగుతోంది

పవన్ కల్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్రంగానే స్పందిస్తోంది. చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ సీఎం జగన్ బహిరంగ సభల్లో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో జనసేన నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందని చెప్పారు. లేదంటే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని నాగబాబు కూడా అన్నారు. పవన్ సీఎం అంశంపై టీడీపీ సైలెంట్ గా ఉండగా.. అలాంటి ప్రకటన తాము చేయబోమని బీజేపీ ప్రకటించింది. దీంతో ఏపీలో పొత్తుల అంశం గందరగోళంగా మారింది. తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్... మరోసారి పొత్తులపై కీలక ప్రకటన చేశారు. అయితే  ఈసారి గతంలో చేసిన ప్రకటనకు భిన్నమైన ప్రకటన చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే అభిప్రాయం వస్తోంది. జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్న టీడీపీలో కలవరం రేపుతోంది.

కౌలు రైతులకు సాయం అందించిన తర్వాత జరిగిన సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తాను సీబీఎన్ దత్తపుత్రుడిని కాదన్నారు. సీఎం జగనే సీబీఐ దత్తపుత్రుడుఅన్నారు. పొత్తులపైనా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తనకు ఎవరితోనూ పొత్తులు లేవని, ప్రజలతోనే పొత్తులు ఉంటాయని అన్నారు. మరోసారి వైసీపీ గెలిస్తే ఏపీ సర్వనాశనం అవుతుందన్నారు. జగన్ ను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2014 లోనే పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత పాలకులను చూసిన ప్రజలు జనసేనకు ఒకసారి అధికారం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పొత్తులపై మాట్లాడబోనన్న జనసేన చీఫ్.. అయితే తన పొత్తులు జనంతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు దసరా తర్వాత రోడ్లపైకి వస్తామని.. వైసీపీ నేతలను పరుగులు పెట్టిస్తామని పవన్ చెప్పారు.

వైసీపీని టార్గెట్ చేస్తూనే పొత్తులపై పవన్ చేసిన కామెంట్లు ఏపీలో ఆసక్తిగా మారాయి. గతంలో వైసీపీని ఓడించేందుకు విపక్షాలు ఏకం కావాలనే సంకేతం ఇచ్చిన పవన్.. ఇప్పుడు మాత్రం ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పడం చర్చగా మారింది. అంతేకాదు జనసేనకు అధికారం ఇవ్వాలని జనాలు కోరుకుంటున్నారంటూ.. పరోక్షంగా తానే సీఎం అభ్యర్థి అని తేల్చేశారు. జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు పవన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే పొత్తులు ఉంటాయనే అర్ధం వచ్చేలా తాజాగా పవన్ చేసిన కామెంట్లు ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది టీడీపీలో ఆందోళన కల్గిస్తోంది. వైసీపీని ఓడించాలంటే జనసేనతో కలిసి పోవడమే బెటరని భావిస్తున్న తెలుగు తమ్ముళ్లకు తాజా పవన్ వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయని తెలుస్తోంది. మరోవైపు పొత్తు విషయంలో టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటందన్న పవన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. ఇది కూడా పవన్ యూటర్న్ తీసుకోవడానికి కారణమనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా పొత్తులపై పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని పరేషాన్ చేస్తుండగా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం జోష్ నింపుతుందని అంటున్నారు.

Read also: Etela Rajender: బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా ఈటల? తెలంగాణలో అమిత్ షా జబర్దస్త్ ప్లాన్..

Read also: Secunderabad Violence: సికింద్రాబాద్ 'అగ్నిపథ్' విధ్వంసం.. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారానే అంతా జరిగింది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News