Pawan Kalyan Meets Vizag Woman: అర్ధరాత్రి మహిళ తెగువ.. ఒడిలో చంటి బిడ్డ.. భుజాన జనసేన జెండా.. చలించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Meets Vizag Woman: విశాఖలో అర్ధరాత్రి వేళ ఓ మహిళ ప్రదర్శించిన తెగువకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆమె ఒడిలో చంటి బిడ్డను పెట్టుకుని.. భుజాన జెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.  

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 19, 2022, 03:43 PM IST
  • విశాఖలో హాట్ టాపిక్ గా మారిన పవన్ పర్యటన
  • నోవొటెల్ నుంచి బయటకు రానీయకుండా పోలీసుల ఆంక్షలు
  • అర్ధరాత్రి సమయంలో చంటిబిడ్డతో పవన్ కు మహిళ సంఘీభావం
Pawan Kalyan Meets Vizag Woman: అర్ధరాత్రి మహిళ తెగువ.. ఒడిలో చంటి బిడ్డ.. భుజాన జనసేన జెండా.. చలించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Meets Vizag Woman: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. విశాఖకు విచ్చేసిన జనసేనానిని కలిసేందుకు చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని.. చేతిలో జనసేన జెండా పట్టుకుని రెండు రోజులపాటు విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద నులక గోవిందం అనే మహిళ, ఆమె భర్త విజయకుమార్ ఎదురుచూశారు. అయితే అక్కడ పవన్ ను కలవడం కుదరలేదు. ఆదివారం అర్ధరాత్రి వైజాగ్ శివారులో ఉన్న గోపాలపట్నంలోని ఇంటికి గోవిందం, విజయ్ కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల చిన్నారి వరలక్ష్మిని తీసుకొని వెళుతుండగా.. మార్గమధ్యంలో కొందరు దుండగులు దారికాచి వారి ఆటోని ధ్వంసం చేశారు. చంటి బిడ్డను ఒడిలో కూర్చొపెట్టుకుని.. భుజాన జనసేన జెండాతో ఉన్న మహిళ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు పవన్ కళ్యాణ్ ను కదలించాయి. 

మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వారిని పిలుపించుకుని మాట్లాడారు. ఆదివారం రాత్రి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం నుంచే నోవాటెల్ హోటల్ వద్దకు వచ్చామని.. తర్వాత పార్టీ ర్యాలీలోను తాము పాల్గొన్నట్లు ఆ దంపతులు చెప్పారు. ఆదివారం ఉదయం పోర్టు కళావాణి స్టేడియంలో జనవాణి కార్యక్రమానికి
వెళ్లామని.. అయితే పవన్ కళ్యాణ్ రాకపోవడంతో మళ్లీ నోవాటెల్ హోటల్ వద్దకు చేరుకొని ఆదివారం రాత్రి అంతా అక్కడే ఎదురుచూశామన్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి ఇంతసేపు బీచ్ రోడ్ లో ఉండకూడదని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. మార్గమధ్యంలోనే అధికార పార్టీ నేతలు తమపై దాడికి పాల్పడి ఆటోను ధ్వంసం చేసినట్లు వారు పవన్ కళ్యాణ్ కు తమ బాధను చెప్పుకున్నారు. 

తమకు ఆటోనే జీవనాధారమని చెప్పినా.. ఆటోలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫొటోలను చింపేసి, ఆటోను పాక్షికంగా ధ్వంసం చేశారని అన్నారు. దాదాపు 20 మంది దుండగులు దాడి చేశారని చెప్పారు. బీచ్ రోడ్ లో కూడా ఆ రాత్రంతా ఉండాలని అనుకున్నామని అయితే పోలీసులు అక్కడ ఉండకూడదని పంపియడంతో వెళ్లిపోయామన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతూ.. ఎలాంటి భయం లేదని, పార్టీ తరఫున నాయకులు అంతా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దీంతో పాటు పార్టీ తరఫు నుంచి రూ.లక్ష చెక్కును వారికి అందజేశారు. ఆటోకి మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ అభినందించారు. 

ఐదేళ్ల చిన్నారి హైందవి అనే చిన్నారి విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ ఎదురుగా జై జనసేన అంటూ నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఆ చిన్నారి ముచ్చటగా చేసిన జై జనసేన నినాదాలను చూసిన పవన్.. ఆ పాపతో ముచ్చటించాలని భావించారు. చిన్నారి హైందవి తల్లిదండ్రులు పల్లా శివప్రసాద్, దేవి దంపతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారితో కాసేపు పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. తమకు మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానమని హైందవి తల్లిదండ్రులు చెప్పారు.

Also Read: Chandrababu-Pawan Kalyan: విజయవాడలో కలుసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సంయుక్తంగా ప్రెస్‌మీట్

Also Read: Heavy Rains Alert: ఏపీలో మూడ్రోజుల వరకూ భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News