Pawan Kalyan: కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది.. పవన్ కళ్యాణ్ జోస్యం

Pawan kalyan Supports To Ippatam Village: ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలను ఖండించారు. కూల్చివేతల ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని జోస్యం చెప్పారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 08:49 PM IST
Pawan Kalyan: కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది.. పవన్ కళ్యాణ్ జోస్యం

Pawan kalyan Supports To Ippatam Village: ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేసినవారే మనవాళ్ళు.. ఓటు వేయనివారు శత్రువులు అనే విధంగా పరిపాలన సాగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ విమర్శించారు. మనవారు కాని వారిని 'తొక్కి నార తీయండి' అనే విధంగా కొనసాగుతోందన్నారు. పాలకులు తమకు ఓటు వేసిన 49.95 శాతం ఓటర్లకు మాత్రమే పాలకులమని భావిస్తున్నట్లు వారి చర్యలు చూస్తే అర్ధమవుతోందని అన్నారు. నేటి ఉదయం నుంచి ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో సాగుతున్న అరాచకమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామవాసులు జనసేన మద్దతుదారులు కావడంతో వారి ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మార్చి 14న జనసేన ఆవిర్భావ సభకు చోటిచ్చి సహకరించడమే స్థానిక ప్రజాప్రతినిధి ఆగ్రహానికి కారణం. అమరావతిలోనే ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించి సభాస్థలి కోసం అన్వేషిస్తున్న తరుణంలో సభకు చోటు ఎక్కడా దొరకకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులు, హెచ్చరికలకు పాల్పడ్డారు. ఇప్పటంవాసులు సభ తమ గ్రామంలో జరుపుకోండని ధైర్యంగా ముందుకు రావడమే నేటి కూల్చివేతలు కారణం. జనసేన సభ జరిగిన తరువాత ఏప్రిల్ నెలలో రోడ్డు విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారు. 

ప్రధాన రహదారికి కాస్త పక్కాగా రాకపోకలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండే గ్రామం ఇప్పటం. ఈ గ్రామం మీదుగా వాహనాల రాకపోకలు ఉండవు. ఇప్పటికే ఊరిలో 70 అడుగుల రోడ్డు ఉంది. దీనిని ఇప్పుడు 120 అడుగుల రోడ్డు విస్తరించి గ్రామానికి అదనపు హంగులు తెచ్చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధి గారు ఉవ్విళ్లురుతున్నారు. ఆయన ఉత్సాహానికి కారణం కేవలం కక్ష సాధింపు. ఆ వంకతో తమకు ఓటేయని వారి ఇళ్ల తొలగింపు. ఈ ఉదయం నుంచి పోలీస్ బలగాల సాయంతో జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తున్నారు. నిజానికి ప్రధాన రహదారి నుంచి ఈ గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు మాత్రం 15 అడుగులు మాత్రమే ఉంది. కూల్చివేత నోటీసులపై ఊరివారందరూ హైకోర్టును ఆశ్రయించారు. 

దీంతో ఆగమేఘాలమీద ఈ రోజు కూల్చివేతలు చేపట్టారు. రోడ్డు పక్కనే మంచినీటి ట్యాంక్ ఉంది. దానిని అలానే ఉంచి ట్యాంక్ పక్కన ఉన్న ఇంటిని కూడా కూలగొట్టారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన జన సైనికులు, వీర మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. దుర్మార్గానికి అండగా నిలబడ్డారు. ఇప్పటం గ్రామస్తుల ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి జనసేన అండగా నిలబడుతుందని స్పష్టం చేస్తున్నాను. 

రెండు రోజుల క్రితం మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈ గ్రామాన్ని సందర్శించి గ్రామ సభలో ప్రసంగిస్తున్న తరుణంలో గ్రామంలో విద్యుత్ ను నిలిపివేసి తమ కుసంస్కారాన్ని ప్రదర్శించారు. ఇటువంటి దుష్ట చర్యలపై అలుపెరగని పోరాటం చేస్తాం. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదు. ఇప్పటం వాసులకు జనసేన అండగా నిలబడుతుంది..' అని పవన్ కళ్యాణ్ పేరు మీద జనసేన పార్టీ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది.

Also Read: Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ దూకుడు.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్  

Also Read: శర్వానంద్ డబుల్ మీనింగ్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News