Pawan Kalyan: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష

Pawan Kalyan Deeksha: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం (డిసెంబర్ 12) సంఘీభావ దీక్ష చేపట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 01:43 PM IST
  • విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ దీక్ష
  • మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో దీక్షకు దిగిన పవన్ కల్యాణ్
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం
 Pawan Kalyan: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష

Pawan Kalyan Deeksha: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దీక్షకు దిగారు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం (డిసెంబర్ 12) సంఘీభావ దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో చేపట్టిన ఈ దీక్ష... సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. దీక్ష ప్రారంభానికి ముందు ఇటీవల ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులర్పించారు. అలాగే, విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణ త్యాగం చేసినవారికి శ్రద్ధాంజలి ఘటించారు. 

 ఈ సందర్భంగా పలువురు జనసేన నేతలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatisation) విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేరళలోని త్రివేండ్రం ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటన చేస్తే... అక్కడి సీపీఎం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కలుపుకుని పోరాటం చేశారని ఆ పార్టీ నేత ఒకరు గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకలా చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలున్నా... ప్రధాని మోదీని కలిసి ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడట్లేదని మరో నేత ప్రశ్నించారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి మీరే ప్రాతినిధ్యం వహించాలని కోరితే ముఖ్యమంత్రి నుంచి ఇంతవరకూ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘీభావ దీక్షకు ముందు గన్నవరం నుంచి మంగళగిరి మార్గంలోని వడ్డేశ్వరంలో పవన్ కల్యాణ్ (AP Politics) శ్రమదానం చేశారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేశారు. స్వయంగా పార చేతపట్టి... గమేళాతో గుంతల్లో మట్టి నింపారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కొంతమంది జనసేన నేతలు కిందపడిపోయారు. శ్రమదానం అనంతరం పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం ఆయన ప్రసంగించనున్నారు.

Also Read: Bigg Boss Guest: ఈ వీకెండ్ బిగ్‌బాస్ హౌస్‌కి ఊహించని అతిథి... ఎవరో తెలుసా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News