CSK Batter Ambati Rayudu meets AP CM YS Jagan: టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో నేడు మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడా రంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై సీఎం జగన్‌తో రాయుడు చర్చించినట్టు సమాచారం తెలుస్తోంది. ఇద్దరి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయట. ఈ సందర్భంగా సీఎం జగన్.. రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.
గతకొద్ది రోజులుగా ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. నేడు ఏపీ సీఎం జగన్‌ను కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఇప్పటికే చెప్పాడు. దీంతో అప్పటినుంచి ఏ పార్టీలో చేరనున్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. రాయుడిని ఏపీ బీఆర్‌ఎస్‌లోకి తీసుకునేందుకు ఏపీ అధ్యక్షుడు తోటం చంద్రశేఖర్.. రాయుడిని కలిసినట్లుగా అప్పుడు న్యూస్ వచ్చింది. అంతేకాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆఫర్ ఇచ్చారట.
కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు.. సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. టీడీపీలో చేరే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా చేసిన ప్రసంగాన్నిరాయుడు తన ట్విట్టర్‌లో రీట్వీట్ చేశాడు. గొప్ప స్పీచ్ సార్ అని.. మీ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ఆ ట్వీటులో పేర్కొన్నాడు. ఈ ఒక్క ట్వీట్ కారణంగా రాయుడు వైసీపీలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే అంబటి రాయుడు క్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని, ఆ విషయంకు సంబంధించి ఏపీ సీఎం జగన్‌ను కలిశాడని సమాచారం తెలుస్తోంది. క్రికెట్ అకాడమీ కోసం ల్యాండ్ మాట్లాడేందుకు జగన్‌తో భేటీ అయ్యాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా రాయుడు, జగన్ భేటీ ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.
Also Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.