Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో(Bay of Bengal)ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ 9 వందల మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. అటు బంగాళాఖాతం వాయవ్వ ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవహించింది. ఫలితంగా తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
అటు ఏపీలో కూడా రానున్న మూడ్రోజులపాటు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నట్టు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతానికి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. మరో మూడ్రోజులు వాతావరణం ఇలాగే ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ(IMD) తెలిపింది. అటు దక్షిణ కోస్తాంధ్రలోనూ ఇదే పరిస్థితి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Also read: 5G Internet Trials: వోడాఫోన్ ఐడియా మెరుపువేగంతో డేటా బదిలీ, త్వరలో 5జీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook