/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Low Depression and Cyclone Alert in Bay of Bengal: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం కారణంగా అటు ఎండలు ఇటు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఎండల తీవ్రత దాదాపుగా తగ్గింది. ఇప్పుడు ఏపీలో అతి భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల్లో అంటే మే 2 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడనుంది. ఇక అక్కడ్నించి ఏపీలో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత వారం రోజులుగా ఏపీలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మధ్యలో ఎండలు కాస్తున్నాయి. దాంతో మిశ్రమ వాతావరణం నెలకొంది. కానీ మొత్తానికి చూస్తే ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పులతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించనున్న రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు మే 31వ తేదీ కేరళ తీరాన్ని తాకవచ్చు. అక్కడ్నించి కేరళ మీదుగా దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాదికి విస్తరించనున్నాయి. జూన్ 6 నాటికి రుతు పవనాలు తెలంగాణలో కూడా వ్యాపించనున్నాయి. సకాలంలో వర్షాలు కురిస్తే పంట సాగు చేసేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ మీదుగా శ్రీలంక వరకూ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దాంతో మే 23 వరకూ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. 

Also read: Election Officer: స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ చేసిన ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IMD Predicts low depression in bay of bengal on May 22, severe to very severe heavy rains alert in coming 4-5 days rh
News Source: 
Home Title: 

Cyclonic low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు

Cyclonic low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు
Caption: 
Low Deprssion in bay of bengal ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Cyclonic low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, May 18, 2024 - 22:41
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
21
Is Breaking News: 
No
Word Count: 
235