AP: జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

Last Updated : Jan 5, 2021, 03:00 PM IST
  • ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • జనవరి 20 తేదీ వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుందన్న జగన్
  • మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం
AP: జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ ( AP ) లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ( House Sites Distribution ) జనవరి 20 వరకూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఇళ్ల స్థలాల పంపిణీ 39 శాతం పూర్తయిందని సీఎం జగన్ ( Cm Jagan ) తెలిపారు. 17 వేలకు పైగా కాలనీల్లో 9 వేల 668 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని..మిగిలినవాటిని పూర్తి చేయాలి అధికారులను ఆదేశించారు.

కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల్ని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పరిపాలనలో పారదర్శకతను పెంచామని..భవిష్యత్‌లో కొనసాగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాల్ని కూడా కల్పించాలని తెలిపారు జగన్. కాలనీ పరిణామాన్ని బట్టి మౌళిక సదుపాయాల్ని కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం గానీ, ఇళ్ల పట్టాల పంపిణీ గానీ జనవరి 20 వరకూ కొనసాగనున్నాయని వైఎస్ జగన్ ( Ys Jagan ) స్పష్టం చేశారు. 

Also read: Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ప్రభుత్వం సీరియస్..సీఐడీ విచారణకు ఆదేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News