Heavy Rains Alert: ఏపీలో గత కొద్దిరోజుల్నించి వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాల నుంచి ఒక్కసారిగా ఎండలు దంచి కొట్టే పరిస్థితికి దారి తీసింది. వేసవిని తలపించే ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడీ ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగే శుభవార్త అందుతోంది. ఏపీలో మరోసారి వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏపీ తీరానికి ఆనుకుని ఉంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలు పడనున్నాయనే వార్తలతో ప్రజలకు ఊరట చెందుతున్నారు. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. ఫలితంగా ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వచ్చే 24 గంటల్లో కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తిరుపతి, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. గుంటూరులో నిన్న అత్యధికంగా 62.5 మిల్లీమీటర్లు, బాపట్లలో 60 మిల్లీమీటర్లు, అనకాపల్లిలో 40 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా రావూరులో 36 మిల్లీమీటర్లు, ఏలూరులో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 15 నుంచి తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉండవచ్చు. ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, విదర్బ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు.
ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, కొంకణ్, గోవా, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. పగటి పూట మాత్రం కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
Also read: Pawan Kalyan: ఆమెను పిడిగుద్దులు గుద్ది భయానకంగా వాలంటీర్ హత్య చేశాడు: పవన్ కళ్యాణ్ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook