Cold Waves: బాబోయ్ చచ్చిపోతున్నాం.. ఎముకలను కొరికేస్తున్న చలి..

Cold Waves: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చలి చంపేస్తోంది. అంతేకాదు ఎముకలు కొరికే చలితో ఉదయం పనిపై బయటకు వెళ్లేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 08:29 AM IST
Cold Waves: బాబోయ్ చచ్చిపోతున్నాం.. ఎముకలను కొరికేస్తున్న చలి..

Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచే మొదలవుతున్న చల్లగాలులు.. మరుసటి ఉదయం ఉదయం 12 దాటినా ఏమాత్రం తగ్గడం లేదు. బయట ఉన్నవారే కాదు.. ఇంట్లో ఉన్న వారూ గజగజా చలికి వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రోగులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏకంగా 6.5 డిగ్రీలు పడిపోయి 5.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.అటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో దాదాపు అన్ని మండలాల్లో  ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని చోట్ల 10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కామారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరివికారాబాద్, సిద్దిపేట,జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఫేస్ చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో ఈ రోజుతో పాటు రేపు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో వృద్దులు, రోగులు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. నిన్న, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ ఎలర్ట్ ప్రకటించింది.  మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాపై చలి పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతలు దారుణాతి దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ముఖ్యంగా యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మంచు సైతం కురుస్తుండడంతో ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. . యాదాద్రి జిల్లాలో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేయగా..నల్గొండ, సూర్యాపేట జిల్లాలో పసుపు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాలకు ‘ఆరెంజ్‌’, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో వచ్చే రెండు రోజుల్లో తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశాలున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ జిల్లాలైన  అల్లూరి సీతారామరాజు జిల్లా  జి.మాడుగులలో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో  చలి పులి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయాల్సి తగు వస్తే జాగ్రత్తలు పాటించాలన్నారు.  చెవులు, ముక్కుతో పాటు శరీరం మొత్తాన్ని చలి నుంచి కాపాడాలని, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News