SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!

Gudivada SI Pilli Vijay Kumar Commits Suicide: కృష్ణాజిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టౌ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 19, 2021, 10:07 AM IST
  • గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిలి విజయ్ కుమార్ ఆత్మహత్య
  • బ్యూటీషియన్‌తో సంబంధాల నేపత్యంలో గతంలో సస్పెండ్ అయ్యాడు
  • రెండు నెలల కిందట ఎస్‌ఐ విజయ్ కుమార్‌కు వివాహం జరిగింది
SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!

Gudivada SI Suicide: Gudivada Two Town SI Pilli Vijay Kumar Commits Suicide: కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. గుడివాడ టౌ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. విజయ్ కుమార్ గతంలో రైల్వేలో ఎస్సైగా పనిచేశారు.

రైల్వేలో పనిచేసిన ఆయన అనంతరం కృష్ణా జిల్లా(Krishna District) ముసునూరు గుడ్లవల్లేరు మండవల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు ప్రస్తుతం గుడివాడ టూ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

 

కాగా, విజయ్ కుమార్ హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా ఓ బ్యూటీషియన్‌తో పరిచయం పెంచుకున్నాడు. బ్యూటీషియన్‌తో సంబంధాల ఆరోపణలపై గతంలో ఆయన సస్పెండ్ అయ్యాడు. రెండు నెలల క్రితం విజయ్ కుమార్‌ వివాహం జరిగింది. అయినా విజయ్ కుమార్ వ్యక్తిగత విషయాలు అంతగా సర్దుబాటు కాలేదని తెలుస్తోంది.

వివాహమై రెండు నెలలు గడుస్తున్నా తన భార్యను కాపురానికి తీసుకురాలేదు. అదే సమయంలో తనకు పరిచయం ఉన్న బ్యూటీషియన్‌తో కలిసి గుడివాడ(Gudivada)లో నివాసముంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: Gold Price Today 19th January 2021: పెరిగిన బంగారం ధరలు.. 5 వేలు పుంజుకున్న వెండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News