Amaravathi: అమరావతి ఉద్యోగులకు శుభవార్త..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

Amaravathi: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Written by - Alla Swamy | Last Updated : Jul 1, 2022, 01:41 PM IST
  • ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
  • గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం
  • అధికారిక ఉత్తర్వులు విడుదల
Amaravathi: అమరావతి ఉద్యోగులకు శుభవార్త..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

Amaravathi: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగించారు. ఈమేరకు అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం అమరావతి పరిధిలో ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులు వారంలో ఐదు రోజులే పని చేస్తున్నారు.

ఈ విధానం మరో ఏడాది పాటు అమలు కానుంది. సీఎస్‌ సమీర్ శర్మ ..దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేస్తున్నారు. జూన్ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది.

దీనిని మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొదట జూలైలో ఫ్లాట్లను వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఐతే దీనిపై ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని సెక్రటేరియట్ ఉద్యోగులు..ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం..వసతి సదుపాయాన్ని రెండు నెలలపాటు పొడిగించింది. నివాసాలను సౌకర్యవంతంగా ఉండాలని..ఏమైనా జరిగినా ఉద్యోగులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

Also read: Manipur Landslide Tragedy: మణిపూర్‌లో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి.. మృతుల్లో ఏడుగురు జవాన్లు

Also read:Online Tickets: జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకంపై హైకోర్టు స్టే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News