Ap cm Ys jagan: ఉద్యోగులకు శుభవార్త, సంక్రాంతికి పెండింగ్ డీఏ విడుదలకు వైఎస్ జగన్ హామీ

Ap cm Ys jagan: సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ..ఉద్యోగులకు శుభవార్త విన్పించింది. పెండింగ్ డీఏ, బకాయిలు, సకాలంలో జీతాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2023, 09:14 AM IST
Ap cm Ys jagan: ఉద్యోగులకు శుభవార్త, సంక్రాంతికి పెండింగ్ డీఏ విడుదలకు వైఎస్ జగన్ హామీ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. డీఏ, వేతానాలు, బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో సానుకూలత వ్యక్తమైంది. సంక్రాంతికి ఒక డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల సమయ పాలన, తీసుకొచ్చిన కొత్త విధానాల విషయంలోనే కాకుండా..పెండింగ్ డీఏ, బకాయిలు, సకాలంలో జీతాలపై ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగుల డీఏలతో పాటు బకాయిల చెల్లింపు విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు. 

పెండింగు బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి జగన్‌ను కోరాయి. కొత్త పీఆర్సీ ఏర్పాటు, పెండింగులో ఉన్న రెండు డీఏల చెల్లింపు గురించి అడిగారు. వీటిపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు. సంక్రాంతికి ఒక డీఏ ఇస్తామని..ఏప్రిల్ నుంచి రెండేళ్ల బకాయిలు క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రతినెలా 1వ తేదీ జీతాలు సక్రమంగా చెల్లించాలన్న డిమాండ్‌పై సానూకూలంగా స్పందించారు.

మరోవైపు ఫేసియల్ అటెండెన్స్ విషయంలో క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న ఇబ్బందుల్ని ఉద్యోగ సంఘ నేతలు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించేవారికి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ప్రకారం జీతాలివ్వాలని కోరారు. మున్సిపల్ ఉద్యోగులకు జీపీఎఫ్ అమలుకే విజ్ఞప్తి చేశారు. 

Also read: Happy Pongal 2023: సంక్రాంతి కోడి పందేలంటే ఆషామాషీ కాదు, నక్షత్రం, రాశిని బట్టి పోటీ, అంతా కుక్కుట శాస్త్రం ప్రకారమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News