M.Nageswararao Twit: ఏపీని వైఎస్‌ఆర్‌ ప్రదేశ్‌గా మార్చండి..సీబీఐ మాజీ డైరెక్టర్‌ హాట్‌ కామెంట్స్..!

M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్‌ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 04:55 PM IST
  • ఏపీని ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ ట్వీట్‌

  • వైరల్‌గా మారిన ట్వీట్
  • ఖండిస్తున్న వైసీపీ ప్రభుత్వం
M.Nageswararao Twit: ఏపీని వైఎస్‌ఆర్‌ ప్రదేశ్‌గా మార్చండి..సీబీఐ మాజీ డైరెక్టర్‌ హాట్‌ కామెంట్స్..!

M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్‌ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రం పేరును వైఎస్ఆర్‌ ప్రదేశ్‌గా మార్చాలని సీఎం జగన్‌కు విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలుగును ఓ తెగులుగా భావించి దాన్ని పీకీ పారేస్తున్నాం..రాష్ట్రానికి వైఎస్‌ఆర్‌ ల్యాండ్ అని ఇంగ్లీష్‌ పేరు పెడితే మరీ బాగుంటుందని అని ట్విట్టర్‌లో తెలిపారు. 

దీనిపై తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతోంది. ఏ ఉద్దేశంతో ఆయన ఈ ట్వీట్ చేశారన్న చర్చ జరుగుతోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయనకు రాష్ట్రం గురించి ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఎవరో తెలియని వ్యక్తులు చేసిన ట్వీట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు.

ఇటు నాగేశ్వరరావు ట్వీట్‌ను టీడీపీతోపాటు ఇతర పార్టీలు సమర్థిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఆయన వివరించారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తెలుగు భాషపై ప్రాధాన్యత తగ్గిపోయిందంటున్నారు. ఏ రాష్ట్రమైన మాతృ భాషను గౌరవిస్తుందని..కానీ జగన్ సర్కార్‌ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మొత్తంగా సీబీఐ మాజీ డైరెక్టర్ చేసిన ట్వీట్‌ రాజకీయ దుమారానికి కారణమైంది.

Also read:High Cholesterol Food: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..!!

Also read:TDP Mahanadu: కొనసాగుతున్న పసుపు పండుగ..ఆమోదం పొందిన తీర్మానాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News