Dr BR Ambedkar Statue: ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు

Dr BR Ambedkar Statue: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల్నించి ప్రజానీకం తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 125 అడుగుల ఈ విగ్రహం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2024, 09:00 PM IST
Dr BR Ambedkar Statue: ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు

Dr BR Ambedkar Statue: విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కొలువుదీరుతోంది. జనవరి 19న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కావడం విశేషం.

అంటరానితనం నిర్మూలన, సమాజంలోని వివక్షల తొలగింపుకు ప్రత్యేక కృషి సల్పిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు 125 అడుగుల విగ్రహం, స్మృతివనంతో ఏపీ ప్రభుత్వం ఘన నివాళి అర్పిస్తోంది.విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన విగ్రహం, అంబేద్కర్ స్మృతివనం ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం నలుమూలల్నించి పెద్దఎత్తున జనం తరలివస్తారని అంచనా. మొత్తం 1 లక్షా 20 వేలమంది సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. 

అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది. అంటే మొత్తం 210 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిలబడనుంది.18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటైంది. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలుంటాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా ఈ విగ్రహం ప్రాచుర్యంలో రానుంది. 

ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది. మొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండవది శంషాభాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది పంచలోహాలతో నిర్మితమైంది. ఇక మూడవది విజయవాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం.

Also read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News