కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ సహా పలువురు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేకపోయా: రామ్ చరణ్
స్థానిక సంస్థల రిజర్వేషన్ల పరిమితిపై దాఖలైన ఈ పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రాతిపదికన లెక్కించి 50శాతానికి పైగా రిజర్వేషన్లు కేటాయించడం వీలుకాదని తేల్చి చెప్పింది. ఏ విధంగా 50శాతం వరకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్పునిచ్చారు. 36-24-36తో సెగలు రేపుతోన్న అందం
గతంలో 2010లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పేర్కొంది. కాగా, ఇందిరా సహానీ కేసులో, 2016లో మరో కేసులో రిజర్వేషన్ల మినహాయింపులకు అవకాశాలు ఉన్నాయని తీర్పులు ఇచ్చారంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు తరఫు లాయర్ దేవదత్ కామత్ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి అమలు చేయడం సాధ్యం కాదని తేల్చిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్