కుటుంబంతో సహా డాక్టర్ ఆత్మహత్య!

కుటుంబంతో సహా డాక్టర్ ఆత్మహత్య!

Last Updated : Aug 30, 2019, 07:30 PM IST
కుటుంబంతో సహా డాక్టర్ ఆత్మహత్య!

అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దారుణం చోటుచేసుకుంది. అమలాపురంలో ఆర్థోపెడిక్‌ డాక్టర్‌‌గా పేరొందిన రామకృష్ణ రాజు తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసినప్పటికీ.. గురువారమే డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అమలాపురంలో కృష్ణా ఆర్ధోపెడిక్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్న డా పెనుమత్స రామ కృష్ణం రాజు (55), ఆయన భార్య లక్ష్మిదేవి (45), కుమారుడు కృష్ణ సందీప్‌ (25) లు అమలాపురంలోని వారి స్వగృహంలోనే విగతజీవులై పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది గమనించడంతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. 

డాక్టర్ కుటుంబం ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి నిర్వహణ, కొడుకు కృష్ణ సందీప్ ఎంబీబీఎస్ చదువు కోసం అధిక వడ్డీ రేట్లకు, అధిక మొత్తంలో అప్పులు చేసిన డాక్టర్ రామకృష్ణంరాజు.. ఆ అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. 

Trending News