Southwest Monsoon: ఏపీకు ఊరట, నైరుతి రుతుపవనాలు ఎప్పుడంటే

Southwest Monsoon: తీవ్రమైన ఎండలతో భగభగమండుతున్న ఏపీకు గుడ్‌న్యూస్. నైరుతి రుతు పవనాల ప్రవేశంపై స్పష్టత వచ్చేసింది. భారీ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో బెంబేలెత్తుతున్న ప్రజానీకానికి సేద తీరనుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనానాలు సముద్రంలో వ్యాపించి ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2023, 12:49 PM IST
Southwest Monsoon: ఏపీకు ఊరట, నైరుతి రుతుపవనాలు ఎప్పుడంటే

Southwest Monsoon: ప్రతి ఏటా వేసవిలో ఎదురుచూసేది నైరుతి రుతు పవనాల కోసమే. ప్రతి యేటా మే 20 తేదీన సముద్రంలో ప్రవేశించే రుతు పవనాలు ఈ ఏడాది 1-2 రోజులు ముందుగానే ప్రవేశించాయి. జూన్ 1 నాటికి దేశంలో ప్రవేశిస్తాయని అంచనా ఉంది. 

వేసవి భగభగమండిపోతోంది. భారీ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలో సగటున 41-49 డిగ్రీల మధ్య ఉష్ణాగ్రత నమోదై ఆందోళన రేగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం మే 29 వరకూ అంటే మరో 10 రోజులు ఇలాగే ఉండవచ్చని అంచనా. గత ఏడాది మే 20 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలో ప్రవేశించగా ఈ ఏడాది రెండ్రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఫలితంగా అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 

ప్రతి ఏటా జూన్ 1 నాటికి దేశంలో కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది మూత్రం మూడ్రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4కు కేరళను తాకనున్నాయి. కేరళ రాష్ట్రాన్ని జూన్ 4న తాకినా ఏపీలో మాత్రం ఆ ప్రభావం ఉండనుంది. కేరళ రాష్ట్రాన్ని తాకిన పదిరోజుల్లో అంటే జూన్ 14,15 నైటికి నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించనున్నాయి. మరోవైపు కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ద్రోణి ప్రభావంతో రానున్న ఐద్రోజులు తేలికపాటి వర్షాలు పడవచ్చు. 

Also read: Summer Alert: ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్, మరో పదిరోజులు తీవ్రంగా ఎండలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News