అమరావతి: రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో జిల్లాల్లో ప్రాధాన్యాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలతో పాటు ప్రతీ ప్రభుత్వ పథకం పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు అదేశించారు. ప్రభుత్వ పకథాలు అమలు విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా అధికారులకు సూచించారు.ప్రాంతాలు, కులమతాలు, రాజకీయలకు అతీతంగా వ్యహరించాలని అధికారులకు సీఎం జగన్ అదేశించారు. అ సందర్భంగా వివిధ శాఖల పనితీరును ప్రస్తావిస్తూ అధికారులకు పలు అంశాలపై సీఎం జగన్ తన విలువైన సూచనలు అదించారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన విషయంలో అధికారులు అనురించాల్సిన అంశంపై సీఎం జగన్ మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజలు మార్పును ఆశించే తమకు ఓటు వేశారు..వారి ఆంకాక్ష మేరకు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ అందించే పథకాలు మరియు సర్వీసులు విషయంలో ఎక్కడా లంచం ఇచ్చే పరిస్థితి రాకుడదు.. దీంతో పాటు ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు పేద ప్రజలు చెప్పులు అరిగే పరిస్థితి రాకూడదని సూచించారు. ప్రజల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేంది లేదన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి గమనిస్తే మన వ్యవస్థలో ఎక్కడ చూసినా బాధనిపిస్తోంది ప్రతీ చోట అవీనీతి కంపుకొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వృద్ధులకు అందిస్తున్న ఫించన్, రేషన్ కార్డు, బీమా, లైఫ్ ఇన్సురెన్స్ దగ్గర నుంచి ఏ చిన్న పథకం అమలుకు నోచుకోవాలన్న అవినీతి కనిపిస్తోంది. బర్త్ సర్థిఫికెట్, డెత్ సర్టిఫికెట్ నుంచి మరే ఇతర ప్రభుత్వ సేవ పొందాలన్న ఇలా ప్రతి చిన్న విషయంలోనూ లంచం..లంచం. ఈ దారుణ పరిస్థితి నుంచి బయటపడాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని సీఎం జగన్ పేర్కొన్నారు. పారదర్శక పాలన కోసం తాను దేనికైనా సిద్ధమని జగన్ పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అవినీతి రహిత పాలన అందించి దేశంలోనే మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు