AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాలల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 03:08 PM IST
AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

AP Grama Sachivalayam Jobs: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామన్నారు. చివరిస్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశామని చెప్పారు.

'ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు. సిబ్బంది హాజరు దగ్గరనుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం  3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలి ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. రిపోర్టింగ్‌  స్ట్రక్చర్‌ పటిష్టంగా ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలి.

అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనది. వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలి. రీ వెరిఫికేషన్‌ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అన్నడం అన్నది ప్రధానం. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల 2 సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుంది. సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవలు అందాలి..' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. 

ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చిందని.. మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా నియామక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.

ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో  అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని అధికారులు కోరారు.

గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం చెప్పారు. అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సిబ్బందితో మంచి సమన్వయం కోసం వారు అందుబాటులో ఉండేలా మెరుగైన విధానాలను అవలంభించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవాలని సూచించారు. 

Also Read: Income Tax: న్యూ ఇయర్‌లో పన్ను చెల్లింపుదారులకు షాక్.. రూ.54 వేల ట్యాక్స్ చెల్లించాల్సిందే..!

Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్.. ఇంట్లోనే కూర్చొని ఆధార్‌ అప్‌డేట్ చేసుకోండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News