/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మేము కాదంటూ ఒకరు.. కాదు వారే అంటూ మరొకరు మాటల యుద్ధానికి తెరలేపారు. "వారితో కలిసి ఉండలేం.. ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు భరిస్తూ వస్తున్నాం. ఇక మా వల్ల కాదు. " అంటూ శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్  డైరెక్టర్ సుష్మా బొప్పన మీడియాకు తెలిపారు. 

"మేము నారాయణ విద్యాసంస్థలతో 5 ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. ఈ కాలంలో మేము ఎన్నో బాధలు, అవమానాలు పడ్డాం, భరించాం. ఇక మా వల్ల కాదు. మా ఓపిక నశించింది. మేము నారాయణ విద్యాసంస్ధలతో కలిసి పనిచేయడం కష్టమే" అని తెలిపారు. ఈ పరిణామానికి దారి తీయటానికి ప్రధాన కారణం చైతన్య సిబ్బందిని అరెస్ట్ చేయడంతో వచ్చింది. 

"రెండు రోజల క్రితం ఒక విద్యార్థిని శ్రీచైతన్య యాజమాన్యం కిడ్నాప్ చేసిందని ఆ విద్యార్ధి తల్లితో నారాయణ యాజమాన్యం కేసు పెట్టించింది. పోలీసులు తమ సిబ్బంది రమేష్, పార్థిసారధిని అరెస్ట్ చేశారు. దీనిపై  పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే.. మావద్ద చేరిన ముగ్గురు విద్యార్థులను చేర్పిస్తే.. చైతన్య సిబ్బందిని వదిలిపెడతామని అంటున్నారని చెప్పారు. కేవలం అధికారం.. రాజకీయ అండదండలతో మంత్రి నారాయణ ఇలా ఇష్టానుసారంగా చేస్తున్నారు. " అని చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ వాపోయారు. ఏటా తమ ఫలితాలను కూడా వారి ఫలితాలుగా ప్రకటించుకొని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇకపై నారాయణ సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేమని అన్నారు. 

నెల్లూరు నుంచి వచ్చిన ఆ ముగ్గురు విద్యార్థులు శ్రీచైతన్య కోచింగ్ సెంటర్  ఓ చేరేందుకు వచ్చారని వారిని తమ సంస్థలో చేర్చేందుకు తల్లితండ్రులే తమను సంప్రదించారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మావద్ద ఉన్నాయి.తమ సిబ్బందిని ఎలా విడిపించుకోవాలా తమకు తెలుసనీ, అందుకే నెల్లూరు వచ్చామని, సిబ్బందిని విడిపించుకొనే తీసుకెళ్తామని వివరించారు. 

శ్రీచైతన్య తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు: నారాయణ జీఎం 

నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మా చేసిన ఆరోపణలపై స్పందించారు. "వారే నారాయణ విద్యార్థులను, తల్లితండ్రులను ప్రలోభాలకు గురిచేసి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఇదేమీ కొత్త కాదు.. ముందు నుంచీ అనేక విద్యాసంస్థలలో విద్యార్థులను శ్రీ చైతన్య ఇలానే తీసుకెళ్లింది. తమ విద్యా సంస్థపైనా పలుమార్లు ఇలాంటి అనైతిక చర్యకు పాల్పడింది శ్రీచైతన్య " అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీచైతన్య యాజమాన్యం ఇలా తమపై నిందలు వేయడం సరికాదని అన్నారు. 

Section: 
English Title: 
Clashes Between Sri Chaitanya, Narayana Institutions
News Source: 
Home Title: 

చైతన్య, నారాయణ మధ్య విభేదాలు 

శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మాటల యుద్ధం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes