Lokesh Padayatra: లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్, షరతులతో అనుమతులు

Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్ర యువగళంపై సందిగ్దత తొలగింది. షరతులతో కూడిన అనుమతులిచ్చారు చిత్తూరు పోలీసులు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 24, 2023, 02:04 PM IST
Lokesh Padayatra: లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్, షరతులతో అనుమతులు

2024 సాధారణ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను తలపెట్టారు. జనవరి 27 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు సంకల్పించారు. కుప్పం సభకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందిగ్దత ఎట్టకేలకు తొలగింది.

జనవరి 27న పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఎట్టకేలకు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ అనుమతులకు షరతులు వర్తిస్తాయని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు, వాహనదారులు, ఎమర్జన్సీ సేవలకు , రాకపోకలకు ఏ విధమైన ఆటంకం కలగకూడదని సూచించారు.  ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులకు నష్టం వాటిల్లకూడదని..రహదారులపై సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పాదయాత్ర పురస్కరించుకుని బాణాసంచా పేల్చకూడదని షరతు విధించారు. పాదయాత్రలో పాల్గొనేవాళ్లు వెంట మారణాయుధాలు తీసుకెళ్లకూడదనే షరతు ఉంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఆదేశాలు పాటించాలని..ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలన్నారు. 

అయితే షరతులతో కూడిన అనుమతులు తీసుకోవాలా వద్దా అని టీడీపీ నేతలు ఆలోచన చేస్తున్నారు. న్యాయనిపుణులతో సంప్రదించిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 27వ తేదీన కుప్పం పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలతో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

రాష్ట్రంలో ప్రజల సమస్యలు, నిరుద్యోగం ప్రదాన ఎజెండాగా నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర యువగళం పేరుతో ప్రారంభిస్తున్నారు రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం వరకూ యాత్ర జరగనుంది. తొలిరోజు అంటే జనవరి 27వ తేదీ ఉదయం 11.03 నిమిషాలకు యాత్ర ప్రారంభం కానుంది. తొలి మూడ్రోజులు కుప్పం నియోజకవర్గంలోనే యాత్ర కొనసాగనుంది. కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల్లో 29 కిలోమిటర్ల యాత్ర కొనసాగుతుంది.

Also read: CBI Notices: 5 రోజుల తరువాతే హాజరౌతా, సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News