Visakhapatnam: ఏపీ విశాఖ నగరంలోని ఆర్కే బీచ్(Vizag RK Beach)లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. ఈ కోత కారణంగా...చిల్డ్రన్‌పార్కులోని ప్రహరీ గోడ కూలిపోవడమే కాక...అక్కడ ఉన్న బల్లలు సైతం విరిగిపోయాయి. చాలా చోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
Also Read: Cyclone Jawad: ఏపీకి తప్పిన ముప్పు..దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనిస్తున్న 'జవాద్' తుపాను..
చిల్డ్రన్స్ పార్కుకు వచ్చే మార్గాన్ని బారికేడ్లతో జీవీఎంసీ(GVMC) మూసేసింది. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకుల(Tourists)కు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నోవాటెల్ హోటల్ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్ తుపాను(Cyclone Jawad) నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook