ట్విట్టర్ వేదికగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తిన చంద్రబాబు ట్వీట్ పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంపై జైట్లీ మాట్లాడుతూ సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. జైట్లీ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు బదులిస్తూ.. సెంటిమెంట్ ఆధారంగానే తెలంగాణ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు.
చంద్రబాబు కామెంట్స్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ తమ పోరాటాన్ని చంద్రబాబు తక్కువ చేసి చూపించడం తగదని హితవుపలికారు. కేటీఆర్ మాట్లలో చెప్పాలంటే..ఏపీ హక్కుల కోసం పోరాడటంలో తప్పులేదు.. కానీ తెలంగాణ ప్రజల పోరాటాన్ని.. త్యాగాలను తక్కువ చేసి మాట్లాడొద్దు.. మేము మీలాగా ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని కోరుకోలేదు.. అది మా హక్కు’ అని చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Sir, with all due respect we, the people of Telangana never flip-flopped in our demand for statehood. Never ever settled for any package even when many were offered
You can fight for your rights but do not belittle and undermine the struggle & sacrifices of people of Telangana🙏 https://t.co/UW7coDL4bb
— KTR (@KTRTRS) March 13, 2018
చంద్రబాబు ట్వీట్ ; కేటీఆర్ కౌంటర్