TDP New Team: తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన పేరుతో కీలక మార్పులు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీపై కుమారునికి పట్టు కోసం సీనియర్లను పక్కనబెడుతున్నారు. కొత్తవారికి అవకాశం పేరుతో సీనియర్లు దూరం పెడుతున్నారు. ముఖ్యంగా పోలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీల్లో మార్పులు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ సమూలంగా మారనుంది. పార్టీలో కుమారుడు నారా లోకేశ్, బావమరిది బాలకృష్ణలకు కీలక పదవులు అప్పగించనున్నారు. చంద్రబాబు కొత్త టీమ్ సిద్ధమౌతోంది. రెండు సార్లు ఒకే పదవిలో ఉన్నవారికి పదోన్నతి లేదా పదవికి దూరం చేసే నిర్ణయం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా పోలిట్ బ్యూరోలో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ పోలిట్ బ్యూరోలో కొందరిని తప్పించే పరిస్థితి కన్పిస్తోంది. ఈ క్రమంలో యనమల, సోమిరెడ్డి, బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లను పక్కనపెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దిగువ స్థాయి కార్యకర్తే అధినేతనే నినాదంతో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్లను దూరం పెట్టే ఆలోచన చేస్తోంది పార్టీ అధిష్టానం.
ఇటు కుమారుడు నారా లోకేశ్‌కు పార్టీలో ప్రాధాన్యత పెంచనున్నారు. సీనియర్లను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీపై లోకేశ్ పట్టు పెంచే ప్రయత్నం జరుగుతోంది. నారా లోకేశ్ కు కొత్తగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి దక్కనుంది. డిప్యూటీ సీఎం పదవిపై విన్పిస్తున్న డిమాండ్ నేపధ్యంలో ముందుగా పార్టీలో కీలక పదవి అప్పగించనున్నారు. బావమరిది బాలకృష్ణకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కనుంది.
ఇక పోలిట్ బ్యూరోలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ మాధుర్ సహా మరో ఇద్దరు మహిళా నేతలు పేర్లు విన్పిస్తున్నాయి. పోలిట్ బ్యూరో మొత్తాన్ని కొత్తవారితో నింపడం ద్వారా లోకేశ్‌కు పార్టీపై పట్టు పెంచే ప్రయత్నం జరుగుతోందనే వాదన విన్పిస్తోంది. పార్టీపరంగా లోకేశ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించి ఆ తరువాత డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచన చేయవచ్చని తెలుస్తోంది.
Also read: Civils Notification 2025: సివిల్స్ నోటిఫికేషన్ విడుదల, చివరి తేదీ, అర్హత ఇతర వివరాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి