Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి.. ఎన్నో అనుమానాలు

Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 08:15 AM IST
  • కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబు ఫోన్
  • కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బాబు
  • దాడిపై అనుమానాలు వ్యక్తంచేసిన కోటంరెడ్డి
Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి.. ఎన్నో అనుమానాలు

Attack on Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. శ్రీనివాసులు రెడ్డిపై కారుతో ఢీకొట్టి దాడికి పాల్పడిన తీరు గురించి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. తెలుగు దేశం పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని.. ఏం భయపడవద్దని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరు తెన్నుల గురించి చంద్రబాబుకు వివరించిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. నెల్లూరు పోలీసులు నిందితుడ్ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. 

తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్న కోటంరెడ్డి.. అందులో భాగంగానే దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు ఇంటి వద్ద సీసీటీవీ డివీఆర్ కావాలని పోలీసులు పట్టుబట్టారని తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇదిలావుంటే, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటంరెడ్డిపై దాడి జరిగిన రెండు నిమిషాల వ్యవధిలోనే... ఇంకా ఎవ్వరూ సమచారం ఇవ్వకుండానే, ఎవ్వరూ ఫిర్యాదు చేయకుండానే కేవలం రెండు నిమిషాల వ్యవధిలో బాలాజీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారని కోటంరెడ్డి ( Kotamreddy Srinivasulu Reddy ) అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

Also Read : Araku Valley: అరకు లోయలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన బస్సు
Also Read : Minister Roja, Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పిచ్చిపిచ్చి వేషాలేయొద్దు : మంత్రి రోజా వార్నింగ్
Also Read : Jogi Ramesh, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News