YS Jagan: పండుటాకులకు అందించే పింఛన్‌పై తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న నీచ రాజకీయంపై వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ వ్యవస్థపై చేస్తున్న కుట్ర రాజకీయాలపై మండిపడ్డారు. 'జూన్ 4వ తేదీ వరకు ఓపిక పట్టాలి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతున్నది. తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి పింఛన్‌ల పంపిణీ కొనసాగిస్తాం' అని జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'రెండు రోజుల్లో ఏకంగా 31 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. 31 మందిని చంపిన చంద్రబాబు హంతకుడు' అని ఆరోపించారు.
Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్ రాజీనామా
'నా అవ్వతాతలకు, దివ్యాంగులకు చెబుతున్నా. జూన్ 4 తేదీన మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే నా మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేందుకే పెడతా' అని జగన్ తెలిపారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర గురువారం తిరుపతి జిల్లాలో జరిగింది. బస్సు యాత్ర అనంతరం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందని తెలిపారు. మరో చారిత్రక విజయం దక్కించుకోవడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు పేద సామాజికవర్గ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలుగా పేర్కొన్నారు. 'ఓటు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు కాదని మన తలరాతను, మన భవిష్యత్‌ను మనంతట మనమే రాసుకునేందుకు అని గుర్తు ఉంచుకోండి' అని ప్రజలకు సూచించారు. దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు.
Also Read: CBN Is Lord Shiva: ఏపీ కోసం నేను శివుడి అవతారం ఎత్తా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పింఛన్లపై స్పందిస్తూ.. 'ఒకటో తేదీన వలంటీర్ల రూపంలో పింఛన్లు ఇంటి వద్దకే అందిస్తుంటే చంద్రబాబు తన మనిషితో అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టుకు వెళ్లారు. రాజకీయాలు చాలా దిగజారిపోయాయి. చెడిపోయాయి. అవ్వాతాతల పింఛన్లు ఆపివేశారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వాతాతలు చనిపోయారు. చంద్రబాబు హంతకుడు అని పిలుద్దాం' అని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పని చేసిన చంద్రబాబు తన పాలనలో చేసిన ఒక్క మంచి పని, ఒక్క పథకం గురించి చెప్పడానికి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్కటన్నా గుర్తుకువస్తుందా అని సందేహం వ్యక్తం చేశారు. పేదలకు తనకు ఉన్నంత ప్రేమ.. ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు అని జగన్ ప్రకటించారు.
'మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కొనసాగిస్తున్న పథకాలను కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేసే అవకాశం ఉంటే తప్పక చేస్తాం. మేనిఫెస్టోలో చేయగలిగిన మంచి అంతా చేస్తాను' అని జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. 175కు 175 ఎమ్మెల్యేలు, 25 పార్లమెంట్ సీట్లతో డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమా? అని పిలుపునిచ్చారు. ప్రజలందరూ గుర్తుంచుకుని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్ జగన్