Chandrababu Letter: చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఏసీబీ న్యాయమూర్తికి రాసిన మూడు పేజీల లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. జైలు అధికారుల ద్వారా ఏసీబీ న్యాయమూర్తికి పంపిన లేఖలో తన ప్రాణాలకు ముప్పుందని, కొందరు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు బాబు కుటుంబసభ్యుల ఆందోళనకు కారణమైంది.
ఏపీ స్కిల్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రాణాలకు ముప్పుందని ఏసీబీ న్యాయమూర్తికి 3 పేజీల లేఖ రాశారు. జైళ్లోనే తనను అంతమొందించాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్టుగా చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. తనను చంపుతామంటూ జిల్లా ఎస్పీకు మావోయిస్టులు లేఖ కూడా రాసినట్టుగా చంద్రబాబు తెలిపారు. తాను జైళ్లోకి రాగానే అధికారికంగా వీడియోలు, ఫోటోలు తీసి తన పరువు, ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఈ ఫుటేజ్ విడుదల చేశారన్నారు. జైళ్లో ఎన్నో విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, కొందరైతే జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారన్నారు. జైలులో మొత్తం 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారున్నారని, కొంతమంది ఖైదీల వల్ల తన భద్రతకు ముప్పుందని లేఖలో రాశారు. అక్టోబర్ 6వ తేదీన జైలు ప్రధాన ద్వారం పైనుంచి ఓ ద్రోన్ ఎగిరిందన్నారు. ములాఖత్‌లో భాగంగా తనను కలుస్తున్నవారి ఫోటోల కోసం ద్రోన్ ఉపయోగిస్తున్నారన్నారు. జైళ్లో తనకు, బయటు తన కుటుంబసభ్యులకు ప్రమాదముందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. గతంలో అంటే 2022 నవంబర్ 4న నందిగామలో తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిందని, 2019 జూన్ 25న తన సెక్యూరిటీని తగ్గించడాన్ని లేఖలో రాసుకొచ్చారు.
ఈ లేఖ ఆధారంగా చంద్రబాబు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచే జైళ్లో తన భర్త ప్రాణాలకు ముప్పుందనే విషయాన్ని చెబుతున్నామని నారా భువనేశ్వరి తెలిపారు. తన భర్త భద్రతకై ప్రార్ధిస్తున్నానని, రాష్ట్రంలోని సోదరీమణులంతా ఆ ప్రార్ధనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కష్టాల్నించి చంద్రబాబు బయటపడేలా ప్రయత్నిద్దామన్నారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు.
Also read: Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu Letter: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ